రెండు నెలల వ్యవధిలో ఎంతో మంది సినీ సెలబ్రిటీలు మరణించిన సంగతి తెలిసిందే. నటీనటులు, నిర్మాతలు, సినిమాటోగ్రాఫర్లు, ఫ్యాషన్ డిజైనర్లు,సింగర్లు లేదా వారి కుటుంబ సభ్యులు ఇలా ఎవరొకరు మరణిస్తూ ఉండడం ఆందోళన కలిగించే విషయంగా చెప్పుకోవచ్చు. వీరిలో అనారోగ్యంతో కొంత మంది చనిపోతే మరికొంత మంది గుండెపోటుతో మరణించారు. ఆత్మహత్య చేసుకున్న వారు కూడా ఉన్నారు. అలాగే వృద్ధ వయసులో ఉన్న వారు అనారోగ్య సమస్యలతో మరణించారు. తాజాగా సినీ పరిశ్రమకు చెందిన మరో సెలబ్రిటీ కన్నుమూశాడు.
అతను ఓ ప్రముఖ సింగర్ కావడం గమనార్హం. మొన్ననే ఇండియన్ సింగర్ నిర్వేయర్.. మరణించగా ఇప్పుడు మరో సింగర్ మరణించడం షాక్ ఇచ్చే అంశం. వివరాల్లోకి వెళితే… కోలీవుడ్ సింగర్ బాంబా బాక్య గుండెపోటుతో మరణించాడు.కోలీవుడ్‌లో ఎన్నో సూపర్ హిట్ సాంగ్స్ పాడిన బాంబా బాక్య ‘రోబో 2.0’ చిత్రంలో ‘పుల్లినంగల్’ సాంగ్‌తో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చాడు.అటు తర్వాత విజయ్ నటించిన ‘సర్కార్’ చిత్రంలో ‘సింతాంగరం’, పొన్నియిన్ సెల్వన్‌లో ‘పొన్నినది’ వంటి సూపర్ హిట్ సాంగ్స్ పాడి క్రేజీ సింగర్ అనిపించుకున్నాడు.
అలాంటి బాంబా 48 ఏళ్లకే గుండెపోటుతో మరణించడం అందరినీ విషాదంలోకి నెట్టేసినట్లు అయ్యింది. ఇతని మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నారు. అతని కుటుంబ సభ్యులకు, సన్నిహితులకు ఇవ్వాలని దేవుడ్ని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. హీరో కార్తీ కూడా ఇతని మరణానికి చింతిస్తూ.. ఓ ఎమోషనల్ ట్వీట్ వేశాడు.
Really saddened by the sudden demise of Bamba Bakiya. I pray that his family and friends have the strength to bear this huge loss. #RIPBambaBakiya
— Actor Karthi (@Karthi_Offl) September 2, 2022
Most Recommended Video
‘రంగ రంగ వైభవంగా’ కి డిజాస్టర్ టాక్ రావడానికి గల 10 కారణాలు..!
పవన్ కళ్యాణ్ తో నటించిన ఈ 11 మంది హీరోయిన్లకు కలిసి రాలేదట..!
8నెలల వయసులోనే సినిమాల్లోకి ఎంట్రీ.. అక్కినేని నాగార్జున గురించి 10 ఆసక్తికర