పవన్ కళ్యాణ్ వ్యక్తిత్వం చాలా మంచిదని ఆయనతో ట్రావెల్ చేసిన వారు చెవుతూ ఉంటారు. ఆయనతో ఒకసారి కలిసి పనిచేస్తే స్నేహితులైపోతారు. పవన్ కళ్యాణ్ కి పరిశ్రమలో అనేకమంది మిత్రులు ఉన్నారు, కొంత మంది సన్నిహితులు ఉన్నారు. అలాంటి వారిలో మాటల రచయిత అబ్బూరి రవి ఒకరు. పవన్ పుట్టినరోజు సందర్భంగా పవన్ గొప్పతనాన్ని ఆయన సోషల్ మీడియాలో పంచుకున్నారు. పవన్ ఎంత పెద్ద స్టార్ హీరో అయినా ప్రతి ఒక్కరిని గౌరవిస్తారు అనడానికి నిదర్శనంగా ఒక సంఘటన పంచుకున్నారు.
ఓ రోజు రాత్రి పవన్ తో అబ్బూరి రవి స్టోరీ డిస్కషన్ లో ఉండగా అబ్బూరికి విపరీతమైన నడుము నొప్పి వచ్చిందట. దానితో సార్ నాకు బ్యాక్ పెయిన్ ఎక్కువగా ఉందని పవన్ తో అబ్బూరి చెప్పారట. ఆ మాట విన్న పవన్ చటుక్కున లేచి గదిలోకి వెళ్లిపోయారట. ఆయన అలా లేచి వెళ్లిపోవడంతో కోపం వచ్చిందేమో అని అబ్బూరి భయపడ్డారట. కానీ పవన్ లోపలి నుండి ఓ చాప, దిండు తెచ్చి నువ్వు పడుకొని చెప్పు, నేను రాస్తానని పాడ్ మరియు పెన్ను తీసుకోని క్రింద కుర్చున్నారట.
పవన్ వ్యక్తిత్వం అంత గొప్పగా ఉంటుందని అబ్బూరి రవి తెలియాజేశారు. ఇక పవన్ ది పసి మనస్తత్వం అని, ఎప్పుడూ సమాజం గురించి ఆలోచిస్తాడని, ఆడపిల్లకు అన్యాయం జరిగితే అసలు సహించలేరని ఆయన ట్వీట్స్ ద్వారా తెలియజేశారు. పవన్ నటించిన అన్నవరం, పంజా చిత్రాలకు అబ్బూరి రవి రచయితగా పనిచేశారు.