సినీ పరిశ్రమలో విషాదాల సంఖ్య పెరుగుతూనే ఉండడం అందరినీ ఆందోళన కలిగించే విషయం. 2022 సెకండ్ హాఫ్ లో చాలా మంది సినీ సెలబ్రిటీలు మరణించారు. నటీనటులు, దర్శకులు , నిర్మాతలు, ఫ్యాషన్ డిజైనర్లు, మేకప్ ఆర్టిస్ట్ లు లేదా నటీనటుల కుటుంబ సభ్యులు, నిర్మాతల కుటుంబ సభ్యులు, దర్శకుల కుటుంబ సభ్యులు ఇలా ఎవరో ఒకరు మరణిస్తూనే వచ్చారు.ఈ ఏడాది చివర్లో కృష్ణంరాజు, కృష్ణ , కైకాల సత్యనారాయణ, చలపతి రావు, జనార్ధన్.. వంటి వారు మరణించారు.
తెలుగు సినిమా పరిశ్రమలోనే కాదు కోలీవుడ్, హాలీవుడ్, బాలీవుడ్ , బోజ్ పురి.. ఇలా పక్క రాష్ట్రాల సినీ పరిశ్రమలకు చెందిన వారు కూడా మరణించడం జరిగింది. ఇదిలా ఉండగా తాజాగా ఓ యూట్యూబర్ కూడా కన్నుమూశాడు. అమెరికన్ యూట్యూబర్, క్రియేటర్.. అయిన కీనన్ కీహిల్ అనారోగ్య సమస్యలతో మరణించాడు. డిసెంబర్ 15 న ఇతనికి ఓపెన్ హార్ట్ సర్జరీ జరిగింది. అయినప్పటికీ ఆరోగ్యం క్షీణించడంతో మరణించాడు.

aమారోటాక్స్ లామి సిండ్రోమ్ అనే వ్యాధి వ్యాపించడంతో ఇతను అంగ వైకల్యానికి గురయ్యాడు. అయినప్పటికీ తన అంగ వైకల్యాన్ని అధిగమించి యూట్యూబ్ ఛానల్ పెట్టి సక్సెస్ అయ్యాడు. ఇతని ఛానల్ కు 7 లక్షలకు పైగా సబ్ స్క్రైబర్ లు ఉన్నారు. ఇతను చేసే వీడియోలకు చాలా క్రేజ్ ఉంది. ఒక్కో వీడియోకి 500 కి పైగా మిలియన్ వ్యూస్ వస్తుంటాయి.ఇతని వయసు కేవలం 27 సంవత్సరాలు మాత్రమే కావడం విశేషం.
బటర్ ఫ్లై సినిమా రివ్యూ& రేటింగ్!
2022లో అలరించిన తెలుగు సినిమాలు ఇవే!
ఇప్పటవరకూ ఎవరు చూడని శ్రీలీల రేర్ ఫోటో గ్యాలరీ!!
‘ఖుషి’ పవన్ ఫ్యాన్స్ కు ఒక డ్రగ్ లాంటిది..రీ రిలీజ్ లో ఎందుకు చూడాలి అంటే..?
