Bigg Boss 6: ‘బిగ్ బాస్ 6’ ఆ యూట్యూబర్ బయటపడిపోయాడు..!

‘బిగ్ బాస్’ దేశవ్యాప్తంగా పాపులర్ అయిన షో అయినప్పటికీ.. తెలుగు ప్రేక్షకులు బాగా ఓన్ చేసుకున్న షో అని చెప్పాలి. ఎందుకంటే తెలుగు ప్రేక్షకులు ఆదరిస్తున్న రేంజ్లో ఈ షోని మిగతా భాషల్లో ఆదరించడం లేదు. ప్రతీ సీజన్ కు భారీ టీఆర్పీ రేటింగ్ నమోదవ్వడం… ప్రతీ ఎపిసోడ్ కు మీమ్స్ రావడం, కంటెస్టెంట్లకి ఆర్మీలు, ఫ్యాన్ క్లబ్ లు అబ్బో తెలుగులో ఈ షోకి జరిగే సందడే వేరు. ఇప్పటికే 5 సీజన్లు సక్సెస్ ఫుల్ గా ముగిసాయి.

త్వరలోనే 6వ సీజన్ కూడా ప్రారంభం కానుంది. ఆల్రెడీ కంటెస్టెంట్ల వేటలో ‘బిగ్ బాస్’ టీం ఉంది. ఈ ఏడాది ‘బిగ్ బాస్ నాన్ స్టాప్’ ఓటీటీ సీజన్ కూడా మొదలైనప్పటికీ అది అంతగా సక్సెస్ కాలేదు. అందులో విజేతగా నిలిచిన బిందు మాధవి.. పేరు తప్ప మిగిలిన కంటెస్టెంట్ల పేర్లు ఎక్కువగా వినిపించలేదు.ఓ రకంగా అది ఫెయిల్యూర్ అనే చెప్పాలి. అయితే 6 వ సీజన్ పై అందరిలోనూ ఆసక్తి నెలకొంది.

ఈసారి కంటెస్టెంట్లుగా ఏ హీరోలు వస్తారు అనే అంశంపై చర్చలు మొదలైపోయాయి. అయితే యూట్యూబర్ హర్ష సాయి పేరు మాత్రం బలంగా వినిపిస్తోంది. ఇటీవల ఓ సందర్భంలో ఈ విషయం పై ఇతను క్లారిటీ ఇచ్చేశాడు. ‘నేను బిగ్ బాస్ షోకి వెళ్తున్నాను అనే వార్తల్లో ఏమాత్రం నిజం లేదు. నాకు ఒక ఇంట్లో కొన్ని రోజుల పాటు ఉండడం ఇష్టం ఉండదు.

నాకు స్వేచ్ఛ కావాలి. అందుకే నా వీడియోలు కూడా నాకు ఇష్టమైన సమయంలో అప్లోడ్ చేస్తూ ఉంటాను’ అంటూ చెప్పుకొచ్చాడు హర్ష. దీంతో అతను బిగ్ బాస్ ఎంట్రీ ఇస్తున్నాడు అంటూ వచ్చిన వార్తలకు ఫుల్ స్టాప్ పెట్టినట్టు అయ్యింది.

అంటే సుందరానికీ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

అభిమాని టు ఆలుమగలు…అయిన 10 మంది సెలబ్రిటీల లిస్ట్..!
‘జల్సా’ టు ‘సర్కారు వారి పాట’.. బ్యాడ్ టాక్ తో హిట్ అయిన 15 పెద్ద సినిమాలు ఇవే..!
చిరు టు మహేష్..సినిమా ప్రమోషన్లో స్టేజ్ పై డాన్స్ చేసిన స్టార్ హీరోల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus