గతేడాది… అంటే 2019 సంక్రాంతికి విడుదలైన ‘ఎఫ్2’ చిత్రం ఘనవిజయం సాధించిన సంగతి తెలిసిందే. దిల్ రాజుకి ఈ చిత్రం థియేట్రికల్స్ పరంగానే రూ.50 కోట్ల వరకూ లాభాలను అందించింది. అందుకే ఈయన అనిల్ రావిపూడి తరువాతి చిత్రం ‘సరిలేరు నీకెవ్వరు’ కి కూడా సహా నిర్మాతగా వ్యవహరించి.. ఆ చిత్రానికి కూడా లాభాలను అందుకున్నాడు. ఇప్పుడు ‘ఎఫ్3’ చిత్రాన్ని పూర్తిగా దిల్ రాజే నిర్మించనున్నాడు. మోర్ ఫన్… మోర్ ఫ్రస్ట్రేషన్ అన్నట్టు.. అనిల్ ఈ చిత్రం స్క్రిప్ట్ ను రెడీ చేసాడు.
అయితే సెట్స్ పైకి తీసుకువెళ్ళడానికి మాత్రం కొంచెం టైం పడుతుంది. వెంకీ ‘నారప్ప’ కంప్లీట్ చేసుకుని రావాలి.. మరో పక్క వరుణ్ తేజ్ కూడా ‘బాక్సర్'(వరుణ్ 10వ చిత్రం వర్కింగ్ టైటిల్) చిత్రాన్ని ఫినిష్ చెయ్యాలి. ఇదిలా ఉండగా.. ‘ఎఫ్3’ చిత్రానికి వచ్చే లాభాల్లో ముగ్గురు వాటాలు తీసుకోబోతున్నారట. దిల్ రాజు నిర్మాత కాబట్టి ఆయన ఒకడని అందరూ అంచనా వేస్తారు. మరో ఇద్దరు ఎవరై ఉంటారు అనేగా మీ డౌట్.
ఒకరు దర్శకుడు అనిల్ రావిపూడి అయితే మరొకరు వెంకటేష్.’ఎఫ్2′ సినిమా సక్సెస్ క్రెడిట్ లో చాలా వరకూ వెంకీ పాత్ర ఉంది. అంతేకాకుండా ‘ఎఫ్3’ ని వెంకీ లేకుండా ఊహించుకోలేము. అందుకే వెంకీ పారితోషికంతో పాటు లాభాల్లో వాటా కూడా కావాలని కోరగా నిర్మాత దిల్ రాజు వెంటనే ఓకే చెప్పేశారని తెలుస్తుంది.
Most Recommended Video
టాలీవుడ్ లో తెరకెక్కిన హాలీవుడ్ చిత్రాలు!
బిగ్‌బాస్ ‘రౌడీ బేబీ’ దేత్తడి హారిక గురించి ఈ విషయాలు మీకు తెలుసా?
రజినీ టు ఎన్టీఆర్.. జపాన్ లో కూడా అదరకొట్టిన హీరోలు వీళ్ళే..!