ప్రేక్షుకులను మెప్పించలేని వెండితెర జంటలు

కొన్ని జంటలను చూస్తే ఒకరి కోసం ఒకరు పుట్టినట్టుగా ఉంటారు. మరికొంతమంది చూస్తే మ్యాచింగ్ కాదు అనిపిస్తుంది. వెండి తెరపైన కూడా అంతే. కొన్ని పైర్స్ ని సినిమాలో చూస్తున్నప్పడు నిజమైన ప్రేముకుల్లా కనిపిస్తారు. వారి మధ్య కెమిస్ట్రీ అంతలా వర్కవుట్ అవుతుంది. అటువంటి నటీనటులు మళ్లీ మళ్లీ నటించాలని కోరుకుంటాం. ఇక మళ్లీ కలిసి నటించకూడదు.. అని ప్రేక్షకులు భావించిన జంటలు కూడా ఉన్నాయి. అటువంటి జంటలను సినిమా చూసి బయటికి వచ్చిన వెంటనే మరిచిపోతాము. ఆ సినీ జోడీలపై ఫోకస్…

మహేష్ బాబు, సిమ్రాన్ వైవీఎస్ చౌదరి దర్శకత్వంలో వచ్చిన యువరాజు సినిమాలో మహేష్ బాబుకు జంటగా సిమ్రాన్ నటించింది. అప్పట్లో సిమ్రాన్ కి మంచి ఫామ్లో ఉంది. అయినా వీరిద్దరి మధ్య కెమిస్ట్రీ ప్రేక్షకులను మెప్పించలేకపోయింది.

పవన్ కళ్యాణ్, రాశిపవన్ కళ్యాణ్ రెండో చిత్రం గోకులంలో సీత. ఇందులో సీతగా రాశి నటించింది. ఆ సినిమా విజయం సాధించింది. అయినా ఆ పెయిర్ మళ్ళీ వెండి తెరమీద కనిపిస్తే చూడాలని ఎవరూ కోరుకోలేదు.

బాలకృష్ణ, లయ నందమూరి బాలకృష్ణ పక్కన ఎంతోమంది హీరోయిన్స్ గా నటించారు. విజయశాంతి లాంటి వారు మళ్ళీ మళ్ళీ నటించారు. అయిన విజయేంద్ర ప్రసాద్ సినిమాలో హీరోయిన్ గా నటించిన లయ, బాలకృష్ణకు సూట్ కాలేదని డైరక్ట్ గా చెప్పిన వారున్నారు. వారిద్దరూ జోడీ నచ్చలేదు.

వెంకటేష్, జెనీలియా యువ హీరోలతో నటించే బబ్లీ హీరోయిన్ జెనీలియా సుబాష్ చంద్రబోస్ సినిమాలో వెంకటేష్ కి జంటగా నటించింది. ఈ జోడీకి ఎవరూ పాస్ మార్కులు కూడా వేయలేదు.

జగపతి బాబు, అనుష్క కుటుంబా కథా చిత్రాల్లో హీరోగా నటిస్తూ మంచి జోష్ లో ఉన్న జగపతిబాబు స్వాగతం సినిమాలో అనుష్క, భూమికతో రొమాన్స్ చేశారు. అందరి పక్కన చక్కగా కుదిరిపోయే స్వీటీ జగపతి బాబు తో మాత్రం బెడిసికొట్టింది. ఈ జోడీ హిట్ పెయిర్ అనిపించుకోలేక పోయింది.

రాజశేఖర్, భూమిక ఖుషీతో కుర్రకారుని ఓ ఊపు ఊపిన భూమిక యాంగ్రీ హీరో రాజశేఖర్ పక్కన నటించింది. నా స్టైల్ వేరు సినిమాలో ఈ జోడీ ఆడిపాడింది. కానీ ఆడియన్స్ ని అలరించలేకపోయింది. ఇద్దరి మధ్య ఏదో మ్యాజిక్ మిస్ అయింది.

సుమంత్, కాజల్ అటు యువ హీరోలతో, ఇటు సీనియర్ హీరోలతోనూ నటించి కాజల్ మంచి నటిగా పేరు తెచ్చుకుంది. పౌరుడు సినిమాలో సుమంత్ పక్కన కూడా నటించింది. అయితే కాజల్ ఆ సినిమాలో నటించిన సంగతిని ఆమె అభిమానులు కూడా మరిచిపోయారు. కారణం మిస్ పెయిర్.

శ్రీకాంత్, అంజలా జావేరిఫ్యామిలీ చిత్రాల హీరో శ్రీకాంత్ పక్కన అందరూ బాగుంటారు. అంజలి జావేరీ నటించిన సినిమాలు కూడా బ్లాక్ బస్టర్ అయ్యాయి. కానీ వీరిద్దరూ సెట్ కాలేకపోయారు. శ్రీకాంత్, అంజలి జావేరీ హీరో హీరోయిన్లుగా నటించిన ప్రేమ సందడి మూవీని సినీ జనాలు చూడలేకపోయారు.

ఇలా మీకు కూడా ఎవరైనా సెట్ కాలేదని అనిపిస్తే చెప్పండి. ఈ ఆర్టికల్లో సెట్ జేస్తాం.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus