ఒకేసారి రెండు సినిమాలను తెరకెక్కించే దర్శకులు చాలా అరుదు. తెలుగులో ఇలాంటివి చాలా కష్టం. అప్పుడెప్పుడో మన సీనియర్ దర్శకులు ఇలా రెండు పడవల ప్రయాణం చేసేవారని విన్నాం. హాలీవుడ్‌లో కూడా అంతే. ఇప్పుడు ఇలాంటి దర్శకులు కనిపించడం లేదు కానీ… గతంలో చాలామంది ఇలా సినిమాలు తీసేవారు. అలా 90వ దశకంలో ప్రముఖ దర్శకుడు స్టీవెన్ స్పిల్‌బర్గ్ కూడా రెండు సినిమాలు ఒకేసారి రెండు సినిమాలు రూపొందించారు. ఆ సమయంలో ఆయన పడ్డ బాధ వర్ణనాతీతం అంట. అసలేమైందంటే…
1992 -93 సమయంలో స్పీల్ బర్గ్ ‘జురాసిక్ పార్క్’, ‘షిండ్లర్స్ లిస్ట్’ అనే రెండు సినిమాలను తెరకెక్కించాడు. ఆ రెండూ సైమల్టేనియస్‌గా తెరకెక్కిచడం విశేషం. ‘జురాసిక్ పార్క్’ చిత్రీకరణ జరుగుతున్న సమయంలోనే స్పీల్‌బర్గ్.. ‘షిండ్లర్స్ లిస్ట్’ కథ విన్నారట. ఆ తర్వాత అతని భార్య కూడా కథ చదివారట. ఈ సినిమా ఎలాగైనా మీరు చేయాల్సిందే అని అనడంతో స్పీల్ బర్గ్ చిత్రీకరించారు.
“షిండ్లర్స్ లిస్ట్’ రచయిత స్టీవెన్ జైలియాన్, ఒక అద్భుతమైన స్క్రిప్ట్‌ను నాముందుంచాడు. అది చదివిన నేను కదిలిపోయాను. నా భార్య ఆ స్క్రిప్ట్ చదివి, ’ఈ సినిమాను ఇప్పుడే తీయాలి, వాయిదా వేయొద్దు’ అంది. ఒక వైపు ’జురాసిక్ పార్క్’ చిత్రీకరణలో రాక్షస బల్లుల బొమ్మలతో పనిచేస్తూ, మరోవైపు ’షిండ్లర్స్ లిస్ట్’ చిత్రం కోసం రాక్షసుల వంటి మనుషుల పాత్రలతో పని చేశాను. అవి నా జీవితంలో దౌర్భాగ్య క్షణాలు” అంటూ నాటి పరిస్థితుల గురించి చెప్పుకొచ్చారు స్పీల్‌బర్గ్.
”షిండ్లర్స్ లిస్ట్’ చిత్రానికి 1994లో ఏడు ఆస్కార్‌లు వచ్చిన సందర్భంగా నిర్మాత బ్రాంకో లూస్టిగ్ మాకు పార్టీ ఇచ్చారు. ఆ సమయంలో ఆయన హిట్లర్ కాన్‌సన్‌ట్రేషన్ క్యాంప్‌లో అవస్థలు పడ్డారు. పార్టీలో మేము ఆనందంలో కాదు, కన్నీటిలో మునిగిపోయాం. మరోసారి… అలాంటి సినిమా తీసే అగత్యం నాకే కాదు, ఎవ్వరికీ రానేకూడదు” అని చెప్పుకొచ్చారు స్పీల్ బర్గ్. ‘షిండ్లర్స్ లిస్ట్’ 25వ వార్షికోత్సవంలో స్పీల్ బర్గ్ ఈ వ్యాఖ్యలు చేశాడు.