అరెరే చిరు,టబుల యంగేజ్ రొమాన్స్ మిస్ అయ్యామే!

మెగాస్టార్ చిరంజీవి, వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కాంబినేషన్ లో సినిమా అంటే ఊహించుకోగలమా..? ఇది ఇప్పటి మాట కాదులెండి. ఈ కాంబినేషన్ లో సుమారు ఇరవై ఏళ్ల క్రితం పట్టాలెక్కాల్సింది. కానీ మధ్యలోనే ఆగిపోయింది. చిరుతో సినిమా చేయడానికి వర్మ ఓ కథను సిద్ధం చేసుకున్నాడు. అశ్వనీదత్ నిర్మాతగా.. చిరంజీవి, టబు జంటగా ఈ సినిమా షూటింగ్ మొదలైంది. సినిమా పేరు ‘వినాలని వుంది’. దాదాపు ఇరవై శాతం షూటింగ్ పూర్తయిన తరువాత చిరుకి స్క్రిప్ట్ పై సందేహాలొచ్చి కొంతవరకు మార్చాలని అడిగితే దానికి వర్మ అంగీకరించలేదు.

దీంతో సినిమా మధ్యలోనే ఆగిపోయింది. తాజాగా ఈ సినిమాలో చిరు, టబుల స్టిల్ ఒకటి బయటకొచ్చింది. ఇందులో చిరు.. టబు చేయి పట్టుకొని కనిపించారు. అప్పటి కాస్ట్యూమ్స్ లో ఈ జంట అందంగా కనిపిస్తోంది. చూస్తుంటే వెండితెరపై వీరిద్దరి రొమాన్స్ మిస్ అయ్యామనిపించకమానదు. ఈ సినిమాలో ఊర్మిల మరో హీరోయిన్. ఈమెతో ఓ పాట కూడా విడుదలైంది. అప్పట్లో ఈ సినిమా గురించి రకరకాల ఊహాగానాలు వినిపించాయి. ఈ సినిమా ఆగిపోవడంతో దీనికోసం స్వరపరిచిన పాటలను దర్శకుడు గుణశేఖర్..

చిరు హీరోగా తెరకెక్కించిన ‘చూడాలని వుంది’ సినిమా కోసం వాడుకున్నారు. ఆ తరువాత ఎప్పుడూ కూడా చిరు-వర్మల కాంబినేషన్ లో సినిమా రాలేదు. ప్రస్తుతం పరిస్థితి చూస్తుంటే ఈ కాంబో సెట్ అయ్యే ఛాన్స్ అసలు లేదనిపిస్తోంది.

Most Recommended Video

బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీస్ ను రిజెక్ట్ చేసిన రాజశేఖర్..!
టాలీవుడ్లో సొంత జెట్ విమానాలు కలిగిన హీరోలు వీళ్ళే..!
ఈ 25 మంది హీరోయిన్లు తెలుగు వాళ్ళే .. వీరి సొంత ఊర్లేంటో తెలుసా?

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus