అల్లు అర్జున్ – కొరటాల శివ సినిమా కథ అదేనా?

ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి తో ‘ఆచార్య’ చిత్రాన్ని తెరకెక్కిస్తున్న దర్శకుడు కొరటాల శివ.. తన తరువాతి సినిమాని అల్లు అర్జున్ తో చేయబోతున్నట్టు ఇటీవల అధికారిక ప్రకటన వచ్చిన సంగతి తెలిసిందే. ‘యువ సుధ ప్రొడక్షన్’ బ్యానర్ పై మిక్కిలినేని సుధాకర్ నిర్మాతగా ఈ చిత్రం రూపొందనుంది.ఇక మిక్కిలినేని సుధాకర్.. దర్శకుడు కొరటాల శివకు మంచి స్నేహితుడు. ఈ ప్రాజెక్ట్ లో కొరటాల శివ కు పార్ట్నర్ షిప్ కూడా ఉందనేది ఇన్సైడ్ టాక్.!

సరే ఆ విషయాన్ని పక్కన పెట్టేస్తే.. ఈ కథ విషయంలో ఇప్పుడు కొత్త ప్రచారం మొదలైంది. ఈ కథ మూడేళ్ళ క్రితమే దర్శకుడు కొరటాల శివ తెరకెక్కించాల్సిందట. అసలు విషయం ఏమిటంటే.. ఎన్టీఆర్ ‘జై లవ కుశ’ చిత్రం చేస్తున్న టైములో తర్వాత సినిమాని కొరటాల శివ డైరెక్షన్లో చేయ్యబోతున్నట్టు అధికారిక ప్రకటన వచ్చింది.ఆ చిత్రాన్ని కూడా ‘యువ సుధ ప్రొడక్షన్’ బ్యానర్ పైనే మిక్కిలినేని సుధాకర్ నిర్మిస్తారని అనౌన్స్ చెయ్యడంతో పాటు ఓ పోస్టర్ ని కూడా విడుదల చేశారు.

కానీ స్క్రిప్ట్ సంతృప్తికరంగా లేదని ఎన్టీఆర్-కొరటాల ఆ ప్రాజెక్ట్ ను లైట్ తీసుకున్నారట. ఇప్పుడు అదే ప్రాజెక్ట్ ను కొరటాల శివ.. అల్లు అర్జున్ తో చెయ్యబోతున్నట్టు టాక్ నడుస్తుంది.’కెమికల్ ఫ్యాక్టరీల వల్ల ప్రకృతి ఎలా నాసనమైపోతుంది’ అనే పాయింట్ తో తెరకెక్కనుందని కూడా టాక్ నడుస్తుంది. అల్లు అర్జున్ ‘పుష్ప’ చిత్రం పూర్తయ్యాకే కొరటాల శివ ప్రాజెక్ట్ మొదలుకానుంది.

Most Recommended Video

ఎక్కువ రోజులు థియేటర్స్ లో ప్రదర్శింపబడిన సినిమాల లిస్ట్!
విడుదల కాకుండానే పైరసీ భారిన పడ్డ సినిమాలు ఎవేవంటే..?
ఈ బుల్లితెర నటీమణుల పారితోషికాలు ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus