పవన్ కళ్యాణ్ కెరీర్ బిగినింగ్ నుండి చాల రీమేక్స్ చేశారు. వాటిలో సుస్వాగతం, ఖుషి, గబ్బర్ సింగ్ వంటి చిత్రాలు బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకొన్నాయి. అలాగే పవన్ చేయాలనుకుని ఆగిపోయినవి కూడా చాలానే ఉన్నాయి. వాటిలో సత్యగ్రహి, టైగర్ సీతారాముడు అనే సినిమాలు కొన్ని. టైగర్ సీతారాముడు సినిమాను పవన్ కళ్యాణ్ దర్శకుడు వీర శంకర్ దర్శకత్వంలో చేయాలనుకున్నారు. టైగర్ సీతారాముడు కథకు స్ఫూర్తి 1986లో వచ్చిన ‘క్రొకోడైల్ డూండే’ అనే ఇంగ్లీష్ మూవీ. పాల్ హాగన్స్ హీరోగా తెరకెక్కిన ఈ ఆస్ట్రేలియన్ యాక్షన్ కామెడీ ఎంటర్టైనర్ ని పవన్ తో చేయాలని దర్శకుడు భావించారు.
పవన్ కళ్యాణ్ ఖుషి లాంటి బ్లాక్ బస్టర్ హిట్ మూవీ తరువాత స్వీయ దర్శకత్వంలో జానీ మూవీ తీశారు. పవన్ లో కెరీర్ ఫస్ట్ డిజాస్టర్ మూవీగా జానీ నిలిచింది. ఈ చిత్రం తరువాత టైగర్ సీతారాముడు సినిమాకు సన్నాహాలు మొదలుపెట్టారు. కారణం ఏదైనా అది కార్యరూపం దాల్చలేదు. డైరెక్టర్ వీర శంకర్ మరలా బాలు సినిమా తరువాత ఈ చిత్రాన్ని ఎలాగైనా పవన్ తో తీయాలని ప్రయత్నించారు. ఐతే అప్పటి పవన్ ఇమేజ్ కి సినిమా బడ్జెట్ కి పొంతన లేకపోవడంతో ఈ మూవీ ఆగిపోయింది. బడ్జెట్ కారణాల రీత్యా వీర శంకర్ ఎంత ప్రయత్నించినా ఈ చిత్రాన్ని నిర్మించలేకపోయారు. దానికి తోడు 2004లో వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన గుడుంబా శంకర్ ప్లాప్ గా నిలిచింది. దీనితో వీరి కాంబినేషన్ ని నమ్మి మూవీ చేయడానికి ఏ నిర్మాత సాహసించలేదు. దీనితో పవన్ టైగర్ సీతారాముడు మూవీ అటకెక్కింది.