పవన్ కళ్యాణ్ ఇప్పుడు ‘జనసేన’ పార్టీని బలోపేతం చేసే పనుల్లో బిజీగా గడుపుతున్నాడు. ఇప్పట్లో సినిమా చేసే అవకాశమే లేదని ఇది వరకే తేల్చి చెప్పేశాడు. కానీ అన్నయ్య చిరంజీవి ‘సైరా’ పుణ్యమా అని తెర పై ఆయన మాట వైన్ అదృష్టం అయినా పవన్ ఫ్యాన్స్ కు దక్కింది. రేపు విడుదల కాబోతున్న ఈ చిత్రం కోసం పవన్ కళ్యాణ్ హార్డ్ కోర్ ఫ్యాన్స్ సైతం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక ఇదే ఛాన్స్ కదా అని… పవన్ ను వెండి తెరపై చూడాలన్న ఆశను కూడా మరింత గట్టిగా పవన్ కు వినపడేలా చేసింది ‘సైరా’ చిత్రం. ప్లాపైనా పర్వాలేదు ఓ సినిమా చేస్తే చాలు అంటూ పవన్ ఫ్యాన్స్ కోరుకుంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ పెడుతున్నారు.
ఇక అన్నయ్య చిరంజీవి కూడా.. ‘నువ్వు కచ్చితంగా సినిమా చేయాలి’ అని పట్టుపడుతుండడంతో… పవన్ ఆలోచించి చెబుతాను అని అన్నాడంట. అలా మరోసారి చిరు ప్రశ్నించగా… ‘సినిమా అంటూ చేస్తే… ఆ కథ పొలిటికల్ బ్యాక్ డ్రాప్’ లో సోషల్ మెసేజ్ తో ఉండే సినిమానే చేస్తాను అని చిరుకి బదులిచ్చాడట పవన్. తదుపరి ఎన్నికలకి పొలిటికల్ కెరీర్ కి ఉపయోగపడేలా ఒక పొలిటికల్ డ్రామా అయితేనే బాగుంటుందని పవన్ భావిస్తున్నాడట. దీని పై మెగా ఫ్యామిలీ కూడా ఆలోచనలో పడ్డారని తెలుస్తుంది. ఇప్పుడు పొలిటికల్ డ్రామా తో కూడిన కథ ఎవరు తీసుకొస్తారు. నిర్మించడానికి అయితే ‘మైత్రి మూవీ మేకర్స్’ వారు రెడీగా ఉన్నారు. అందులో డౌటే లేదు. కానీ పొలిటికల్ డ్రామాతో అభిమానులని కూడా ఆకట్టుకునేలా ఏ దర్శకుడు తెరకెక్కించగలడు.? ప్రస్తుతం ఇవే ప్రశ్నలు అభిమానుల్లో ఉన్నాయి. ఏదేమైనా అభిమానుల్ని మరోసారి అయోమయంలోకి గెంటేసాడు పవన్.
‘సైరా’ నరసింహారెడ్డి లో ఆకర్షించే అంశాలు ఇవే!
‘బిగ్ బాస్ 3’ హౌస్ మేట్స్ ను సినిమా పోస్టర్లతో పోలిస్తే?