Stree 2 Review in Telugu: స్త్రీ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

  • August 19, 2024 / 01:20 PM IST

Cast & Crew

  • రాజ్ కుమార్ రావు (Hero)
  • శ్రద్ధాకపూర్ (Heroine)
  • అభిషేక్ బెనర్జీ, ఆపర్ శక్తి ఖురానా, పంకజ్ త్రిపాఠి తదితరులు.. (Cast)
  • అమర్ కౌశిక్ (Director)
  • దినేష్ విజన్ - జ్యోతి దేశ్ పాండే (Producer)
  • సచిన్-జిగర్ & జస్టిన్ వర్గీస్ (Music)
  • జిష్ణు భట్టాచార్జీ (Cinematography)
  • Release Date : ఆగస్ట్ 15, 2024

2018లో విడుదలైన “స్త్రీ” ఒక సెన్సేషన్. పాతిక కోట్లతో తెరకెక్కించిన ఆ సినిమా దాదాపుగా 200 కోట్లు కలెక్ట్ చేసి చరిత్ర సృష్టించింది. ఇప్పుడు ఆ సినిమాకి సీక్వెల్ గా రూపొందిన చిత్రమే “స్త్రీ 2” (Stree 2) . సేమ్ క్యాస్ట్ & క్రూతో రూపొందిన ఈ చిత్రంపై మంచి అంచనాలు ఉన్నాయి. మరి ఆ అంచనాలను “స్త్రీ 2” అందుకోగలిగిందో లేదో చూద్దాం..!!

Stree 2 Review

కథ: చందేరీ గ్రామంలో “స్త్రీ” సమస్య తొలగింది అని అందరూ ఊపిరి పీల్చుకునేలోపు “సర్కట”తో కొత్త సమస్య మొదలవుతుంది. ఈ సమస్యను విక్కీ (రాజ్ కుమార్ రావు), రుద్ర (పంకజ్ త్రిపాఠి), జన (అభిషేక్ బెనర్జీ), బిట్టు (ఆపర్ శక్తి ఖురానా)తో కలిసి పేరు లేని భూతం (శ్రద్ధా కపూర్) ఎలా ఎదుర్కొంది? అనే కథాంశంతో తెరకెక్కిన చిత్రం “స్త్రీ 2” (Stree 2) .

నటీనటుల పనితీరు: రాజ్ కుమార్ రావు కామెడీ టైమింగ్ తో విశేషంగా ఆకట్టుకున్నాడు. సీరియస్ సన్నివేశాల్లోనూ తనదైన మ్యానరిజమ్స్ తో అలరించాడు. అలాగే.. జన & బిట్టు పాత్రల్లో అభిషేక్ బెనర్జీ & ఆపర్ శక్తి ఖురానాలు అదరగొట్టారు. ఇక ‘స్త్రీ’గా (Stree 2)  కీలక పాత్రలో శ్రద్ధా కపూర్ గ్లామర్ ను యాడ్ చేస్తూ అలరించింది. ఇక పంకజ్ త్రిపాఠి మరోసారి తన సీనియారిటీ ప్రూవ్ చేసుకున్నాడు. అతిథి పాత్రలో వరుణ్ ధావన్ మెరిసాడు. తమన్నా స్పెషల్ సాంగ్ మంచి జోష్ తీసుకొచ్చింది.

సాంకేతికవర్గం పనితీరు: దర్శకుడు అమర్ కౌశిక్ ఒక సపరేట్ సినిమాటిక్ యూనివర్స్ క్రియేట్ చేస్తున్న విధానం బాగుంది. “స్త్రీ, బేడియా, ముంజ్యా” తదితర చిత్రాలను, సదరు చిత్రాల్లోని కీలకపాత్రలను ఒక్క చోటికి తీసుకొస్తూ ఆడియన్స్ ను సర్ప్రైజ్ చేస్తున్న విధానం బాగుంది. అదే విధంగా సన్నివేశం ఎంత సీరియస్ అయినా.. అందులో కామెడీ పండించడం అనేది ఎక్కడా నెగిటివ్ అవ్వకుండా ఆడియన్స్ ను అలరించడం అనేది ప్రశంసించాల్సిన విషయం. కాకపోతే.. ఫస్టాఫ్ లో పండిన స్థాయిలో కామెడీ సెకండాఫ్ లో వర్కవుటవ్వలేదు. అలాగే.. ఎండింగ్ కూడా సరిగా లేదు. అందువల్ల ప్రేక్షకులు సంతృప్తి లేకుండా థియేటర్లు వీడతారు.

సినిమాటోగ్రఫీ & వి.ఎఫ్.ఎక్స్ వర్క్ సినిమాకి మరో ఆకర్షణగా నిలిచాయి. ప్రొడక్షన్ డిజైన్ & ఆర్ట్ వర్క్ కూడా బాగున్నాయి. నిర్మాతలు ఎక్కడా రాజీపడలేదు అని ఈ విషయాలు ప్రూవ్ చేస్తాయి.

విశ్లేషణ: ఈ లాంగ్ వీకెండ్ లో మంచి ఫన్ కేటర్ చేసిన సినిమా “స్త్రీ 2” (Stree 2) . కామెడీ, మ్యాజిక్, లాజిక్ సరిసమానంగా కలగలిసిన హారర్ కామెడీ ఎంటర్టైనర్ ఇది. స్నేహితులతో కలిసి చూస్తే ఇంకాస్త ఎక్కువ ఫన్ ఉంటుంది. ఈ తరహా క్లీన్ కామెడీలు ఎక్కువగా వస్తుంటే బాక్సాఫీస్ కూడా కళకళలాడుతూ ఉంటుంది.

ఫోకస్ పాయింట్: “స్త్రీ” రేంజ్ లో కాకపోయినా.. హిలేరియస్ గా ఎంటర్టైన్ చేసిన “స్త్రీ 2”.

రేటింగ్: 3/5

వేదా సినిమా రివ్యూ & రేటింగ్!

Rating

3
Read Today's Latest Reviews Update. Get Filmy News LIVE Updates on FilmyFocus