ఈ హీరోయిన్లు సినిమా ఇండస్ట్రీలో సక్సెస్ సాధిస్తారా?

సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్లు సక్సెస్ సాధించాలంటే కెరీర్ తొలినాళ్లలో వరుస విజయాలను సొంతం చేసుకోవాలనే సంగతి తెలిసిందే. కెరీర్ తొలినాళ్లలోనే వరుస ఫ్లాపులు ఎదురైతే మాత్రం హీరోయిన్లు ఎక్కువ సంఖ్యలో ఆఫర్లను సొంతం చేసుకోవడం తేలిక కాదు. ఫెయిల్యూర్ ముద్ర పడిన హీరోయిన్లకు ఛాన్స్ ఇవ్వాలంటే దర్శకనిర్మాతలు సైతం తెగ టెన్షన్ పడతారనే సంగతి తెలిసిందే. తొలి అడుగులోనే తడబడిన హీరోయిన్లలో కేతిక శర్మ ఒకరు.

ఈ హీరోయిన్ ఇప్పటివరకు మూడు సినిమాలలో నటించగా ఈ మూడు సినిమాలు ఒక సినిమాను మించి మరొకటి ఫ్లాప్ అయ్యాయి. లైగర్ సినిమాతో అనన్య పాండే టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయమయ్యారనే సంగతి తెలిసిందే. భారీ అంచనాలతో విడుదలైన లైగర్ సినిమా ప్రేక్షకులను ఏ మాత్రం ఆకట్టుకోలేదు. ఈ సినిమా అనన్య పాండేకు మైనస్ అయిందని కామెంట్లు వినిపించాయి. అనన్య పాండే తెలుగులో మరిన్ని ఆఫర్లతో బిజీ కావడం కష్టమేనని నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.

బాలీవుడ్ హీరోయిన్ సయీ మంజ్రేకర్ గని సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయమయ్యారు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో సక్సెస్ సాధించకపోవడంతో సయీ మంజ్రేకర్ కు షాక్ తగిలినా మేజర్ సినిమాతో సయీ మంజ్రేకర్ సక్సెస్ ను సొంతం చేసుకున్నారు. అంటే సుందరానికి సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి నజ్రియా పరిచయం కాగా ఈ సినిమాలో నజ్రియా నటనకు మంచి మార్కులు పడినా ఈ సినిమా ఆశించిన స్థాయిలో సక్సెస్ సాధించలేదనే సంగతి తెలిసిందే.

గాడ్సే సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ఐశ్వర్యా లక్ష్మికి కూడా తొలి సినిమాతోనే షాక్ తగిలింది. రామారావు ఆన్ డ్యూటీలో నటించిన రజిషా విజయన్ అశోకవనంలో అర్జున కల్యాణం సినిమాలో నటించిన రితికా నాయక్ కూడా తొలి సినిమాలతో అశించిన సక్సెస్ ను సొంతం చేసుకోలేదు. తర్వాత ప్రాజెక్ట్ లతో ఈ హీరోయిన్లు ఇండస్ట్రీలో సక్సెస్ సాధిస్తారేమో చూడాల్సి ఉంది.

రంగ రంగ వైభవంగా సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘రంగ రంగ వైభవంగా’ కి డిజాస్టర్ టాక్ రావడానికి గల 10 కారణాలు..!
పవన్ కళ్యాణ్ తో నటించిన ఈ 11 మంది హీరోయిన్లకు కలిసి రాలేదట..!
8నెలల వయసులోనే సినిమాల్లోకి ఎంట్రీ.. అక్కినేని నాగార్జున గురించి 10 ఆసక్తికర

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus