ప్రముఖ స్టంట్ మ్యాన్, తమిళ సినిమాలో కార్ జంపింగ్ స్పెషలిస్ట్‌గా పేరు తెచ్చుకున్న స్టంట్ మ్యాచ్ రాజు మృతి చెందారు. దీంతో కోలీవుడ్‌లో విషాదం నెలకొంది. ఆర్య హీరోగా పా.రంజిత్ తెరకెక్కిస్తున్న ఓ సినిమా చిత్రీకరణలో భాగంగా సెట్స్‌లో ఈ ఘటన జరిగింది. చెన్నైలోని నాగపట్నం సమీపంలో ఈ సినిమా షూటింగ్ జరుగుతుండగా.. కారుతో స్టంట్స్ తెరకెక్కిస్తున్నారు.
ఈ క్రమంలో రాజు గుండెపోటుకు గురయ్యారు. చికిత్స కోసం సమీపంలోని ఆస్పత్రికి తీసుకెళ్లగా అప్పటికే స్టంట్ మ్యాన్ రాజు మరణించినట్టు వైద్యులు తెలిపారు. స్టంట్ మ్యాన్ రాజు మృతి పట్ల ప్రముఖ కథానాయకుడు విశాల్ సంతాపం ప్రకటించారు. రాజు ధైర్యవంతుడని కొనియాడారు. ఆయన కుటుంబానికి అండగా ఉంటామని తెలిపారు.
తన సినిమాల్లో స్టంట్ మ్యాన్ రాజు ఎన్నో సాహసోపేతమైన స్టంట్స్ చేశారని విశాల్ గుర్తుచేసుకున్నారు. రాజు చాలా రిస్కీ స్టంట్ చేస్తాడని విశాల్ చెప్పుకొచ్చారు. ఇక రాజు.. గ్రేట్ కార్ జంపింగ్ స్టంట్ ఆర్టిస్ట్స్‌లో ఒకరని స్టంట్ కొరియోగ్రాఫర్ సిల్వ గుర్తు చేసుకున్నారు. స్టంట్ యూనియన్, చిత్ర పరిశ్రమ రాజును మిస్ అవుతోందని సిల్వ తన సోషల్ మీడియా పోస్టులో పేర్కొన్నారు.
ఆర్య, పా.రంజిత్ కాంబినేషన్‌లో రూపొందుతున్న ఈ సినిమా గతంలో వచ్చిన ‘సార్‌పట్ట’ సినిమాకు సీక్వెల్. ఈ సినిమా షూటింగ్‌లో దురదృష్టవశాత్తు స్టంట్ మ్యాన్ రాజు మరణించారు.