డ్యాన్స్ మాస్టర్ గా ఇండియాలోనే టాప్ 3 లో ఒకరిగా నిల్చిన రాఘవ లారెన్స్, అక్కినేని నాగార్జున హీరో గా నటించిన ‘మాస్’ సినిమాతో డైరెక్టర్ గా మారిన సంగతి అందరికీ తెలిసిందే. ఈ సినిమా అప్పట్లో ఎంత పెద్ద హిట్ అయ్యిందో మన అందరం చూసాము. ఈ సినిమా తర్వాత లారెన్స్ డైరెక్టర్ గా కూడా తన టాలెంట్ ని నిరూపించుకున్నాడు. ఇక ఈ చిత్రం తర్వాత ఆయన ‘స్టైల్’ అనే చిత్రం చేసాడు.
ఈ సినిమాలో ఆయనతో పాటుగా ప్రభుదేవా మాస్టర్ కూడా నటించాడు. ఈ చిత్రం కూడా పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. ఇక లారెన్స్ కి డ్యాన్స్ మాస్టర్ గా జీవితాన్ని ఇచ్చిన మెగాస్టార్ చిరంజీవి, అలాగే డైరెక్టర్ గా జీవితాన్ని ఇచ్చిన అక్కినేని నాగార్జున ఇద్దరు కూడా ఈ చిత్రం లో అతిథి పాత్రల్లో కనిపించారు. అప్పట్లో వీళ్లిద్దరు అలా గెస్ట్ రోల్స్ లో కనిపించడం వల్ల ఈ మూవీ రేంజ్ మరో లెవెల్ కి వెళ్ళింది.
ఇకపోతే ఈ చిత్రం లో ప్రభుదేవా కి పోటీగా ఒక డ్యాన్సర్ కనిపిస్తాడు గుర్తుందా..?, బహుశా ఈ సినిమాకి అతనే విలన్, క్లైమాక్స్ లో లారెన్స్ తో కూడా అతనికి భీభత్సమైన డ్యాన్స్ పోటీ ఉంటుంది. లారెన్స్ తో సమానంగా చాలా చక్కగా డ్యాన్స్ వేసాడే ఈ కుర్రాడు. ఎవరి అయ్యుంటారు?, ఈ సినిమా తర్వాత మళ్ళీ ఏ చిత్రం లో కూడా నటించలేదే అని చాలా మంది అనేకసార్లు అనుకున్న సందర్భాలు ఉన్నాయి.
ఈ చిత్రం (Style Movie) తర్వాత అతను సినిమాలు వద్దు అనుకున్నాడు. ఇంతకీ అతని పేరు ఏంటంటే సూర్య. ఇతను తమిళం లో టాప్ మోస్ట్ యాక్టర్ గా పిలవబడే ఆనంద్ రాజ్ కి కుమారుడు. ఆనంద్ రాజ్ తెలుగు లో కూడా చాలా సినిమాలు చేసాడు, మోహన్ బాబు పెద్ద రాయుడు చిత్రం లో మెయిన్ విలన్ ఇతనే. ఆయన కొడుకుగా కేవలం ఈ ఒక్క సినిమా లో మెరిసి, ఆ తర్వాత విదేశాల్లో స్థిరపడిపోయాడు సూర్య.
బాలీవుడ్ లో అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకునేది ఆ హీరోనేనా..!
‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ ప్రియాంక జైన్ గురించి 10 ఆసక్తికర విషయాలు..!
‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ దామిని భట్ల గురించి 10 ఆసక్తికర విషయాలు!