Jr NTR: ఎప్పుడు నేర్చుకుంటాడో తెలియదు.. అదరగొట్టేస్తాడట!

ఎనర్జీ, డైలాగ్‌ డిక్షన్‌, మెమొరీ పవర్‌.. ఇలా అన్నింటా తారక్‌ సూపర్‌ అనే విషయం తెలిసిందే. ఆయనతో పని చేసిన నటీనటులు ఈ మాటలు చెబుతుంటారు కూడా. అలాగే తారక్‌ సెట్స్‌లో ఎలా ఉంటారనేది కూడా చెబుతుంటారు. ఎవరు చెప్పినా.. ఎంత చెప్పినా ఇంకా వినబుద్ధి వేస్తుంటూ ఉంటుంది. అందులోనూ సీనియర్‌ నటులు చెప్పేటప్పుడు అవి ఇంకా బాగుంటాయి. తాజాగా తారక్‌ గురించి సీనియర్‌ నటుడు శుభలేఖ సుధాకర్‌ కూడా మాట్లాడారు. ఇప్పుడు ఆయన చెప్పిన మాటలు వైరల్‌ అవుతున్నాయి.

తారక్‌ – శుభలేఖ సుధాకర్‌ గతంలో కొన్ని సినిమాల్లో నటించారు. ‘అరవింద సమేత’లో ఇద్దరినీ ఒకే ఫ్రేమ్‌లో చూడొచ్చు కూడా. మరి సెట్స్‌లో తారక్‌ ఎలా ఉంటారు, మీరేం గమనించారు అని సుధాకర్‌ని అడిగితే ఆసక్తికరమైన విషయాలు చెప్పుకొచ్చారు. తారక్‌ ఎనర్జీకి హ్యాట్సాఫ్‌ అంటూ శుభలేఖ సుధాకర్‌ ఘనంగా చెప్పుకొచ్చారు. అలాగే ఆయన మెమొరీ పవర్‌ కానీ, నటించే విధానం కానీ అన్నీ అద్భుతంగా ఉంటాయి అని చెప్పారు.ఇక తారక్‌ సెట్స్‌లో ఎలా ఉంటారో చెబుతూ..

యాక్షన్‌ చెప్పాక ఓ ఎన్టీఆర్, కట్‌ చెప్పాక మరో ఎన్టీఆర్‌ కనిపిస్తారని చెప్పారు శుభలేఖ సుధాకర్‌. సెట్స్‌ మీద అందరితో జోవియల్‌గా ఉంటూ, ఆటపట్టించే ఎన్టీఆర్‌.. వన్స్‌ టేక్‌కి సిద్ధమవ్వగానే పూర్తిగా మారిపోతారని చెప్పారు. అసలు అన్నేసి పేజీల డైలాగ్‌లు ఎప్పుడు చదువుకున్నారు, ఎలా గుర్తుంచుకున్నారు అనేది కూడా తెలియదని, కానీ పక్కాగా డైలాగ్‌ డెలివరీ చేసి అదరగొడతారని.. అసలు ఎప్పుడు, ఎలా చదువుకున్నాడు, ఎలా చెప్పగలిగాడు అనేది తెలియదనని శుభలేఖ సుధాకర్‌ ఆశ్చర్యపోతూ చెప్పారు.

‘అరవింద సమేత’లో శుభలేఖ సుధాకర్‌ ‘అరవింద సమేత’ సినిమాలో నటించిన విషయం తెలిసిందే. అందులో రాజకీయ నాయకుడిగా ఆయన కనిపిస్తారు. తారక్‌తో ఆయనకు కొన్ని సన్నివేశాలు ఉంటాయి. సినిమాను కీలక మలుపు తిప్పే అన్ని సన్నివేశాల్లో ఇద్దరూ కనిపిస్తారు అని చెప్పాలి. అప్పుడు చూసిన పరిచయంతోనే సుధాకర్‌ ఇవన్నీ చెప్పారు. తారక్‌ టాలెంట్‌కి మురిసిపోయిన వారిలో ఈయన ఇలా చేరారు.

థాంక్యూ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ఈ 10 మంది దర్శకులతో కనుక గోపీచంద్ సినిమాలు తీస్తే.. యాక్షన్ మూవీ లవర్స్ కు పండగే..!
డిజాస్టర్ టాక్ తో కూడా రూ.70 కోట్లు పైగా కలెక్ట్ చేసిన 10 సినిమాల లిస్ట్..!
హీరో తెలుగు – డైరెక్టర్ తమిళ్, డైరెక్టర్ తమిళ్- హీరో తెలుగు..వంటి కాంబోల్లో రాబోతున్న 11 సినిమాలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus