బిగ్ బాస్ 5వ వారంలో భాగంగా కంటెస్టెంట్ శుభశ్రీ హౌస్ నుంచి బయటకు వచ్చిన విషయం మనకు తెలిసిందే. ఇప్పటికే ఐదు వారాలు పూర్తి చేసుకున్నటువంటి ఈ కార్యక్రమం నుంచి 5 మంది కంటెస్టెంట్లు బయటకు వచ్చారు. ఐదవ వారంలో శుభశ్రీ ఎలిమినేట్ అయ్యారు. ఇక ఆదివారం సాయంత్రం వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా మరో ఐదుగురు కంటెస్టెంట్ లో హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చారు. ఇలా ఈ కార్యక్రమం ద్వారా ప్రేక్షకులను పెద్ద ఎత్తున సందడి చేసిన శుభశ్రీ ఐదవ వారం ఎలిమినేట్ కావడంతో ఈమె బిగ్ బాస్ హౌస్ లో ఐదు వారాల పాటు కొనసాగినందుకు ఎంత మొత్తంలో రెమ్యూనరేషన్ తీసుకున్నారనే విషయాల గురించి వార్తలు వైరల్ అవుతున్నాయి.
మరి శుభ శ్రీ 5 వారాలకు బిగ్ బాస్ నుంచి పొందిన రెమ్యూనరేషన్ ఎంత అనే విషయానికి వస్తే.. ఈమె వారానికి రెండు లక్షల రూపాయలు చొప్పున బిగ్ బాస్ కార్యక్రమంలో 5 వారాలపాటు కొనసాగి 10 లక్షల రూపాయల వరకు రెమ్యూనరేషన్ అందుకున్నారని తెలుస్తోంది. ఇలా బిగ్ బాస్ ద్వారా భారీ మొత్తంలోనే రెమ్యూనరేషన్ అందుకుంది అంటూ వార్తలు వస్తున్నాయి. అయితే శుభశ్రీ మరికొన్ని రోజులపాటు హౌస్ లో కొనసాగి ఉంటే బాగుండేదని పలువురు భావిస్తున్నారు.
ఇక నాగార్జున ఆదివారం ఎపిసోడ్ ప్రారంభంలోనే ఈమెను (Subhashree) హౌస్ నుంచి ఎలిమినేట్ చేశారు. అదే విధంగా మరొక కంటెస్టెంట్ గౌతమ్ ను కూడా ఎలిమినేట్ చేస్తున్నానని చెప్పి తనని సీక్రెట్ రూమ్ కి పంపించిన సంగతి తెలిసిందే .ఇలా బిగ్ బాస్ నుంచి వీరిద్దరూ బయటకు రాగా మరొక ఐదుగురు కంటెస్టెంట్ లు హౌస్ లోకి వైల్డ్ కార్డు ద్వారా ఎంట్రీ ఇచ్చారు. మరి కొత్త కంటెస్టెంట్ల రాకతో హౌస్ లో ఎలాంటి సందడి ఉంటుందో తెలియాల్సి ఉంది.
గత 10 సినిమాల నుండి రామ్ బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే..?
‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ శుభ శ్రీ గురించి ఈ 14 విషయాలు మీకు తెలుసా?
‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ టేస్టీ తేజ గురించి 10 ఆసక్తికర విషయాలు