ఈ ఏడాది కచ్చితంగా సక్సెస్ సాధించాల్సిన ప్రముఖ సెలబ్రిటీలు వీళ్లే!

2023 సంవత్సరం కొంతమంది టాలీవుడ్ హీరోలకు సక్సెస్ అందించినా మరి కొందరు హీరోలకు మాత్రం సక్సెస్ దక్కలేదనే సంగతి తెలిసిందే. ఈ మధ్య కాలంలో సరైన సక్సెస్ లేని హీరోలలో నితిన్ ఒకరు. నితిన్ ఈ మధ్య కాలంలో నటించిన మాచర్ల నియోజకవర్గం, ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్ సినిమాలు ప్రేక్షకులను నిరాశపరిచాయి. ఈ సినిమాలు నిర్మాతలకు భారీ స్థాయిలో నష్టాలను మిగిల్చాయనే సంగతి తెలిసిందే. మరో యంగ్ హీరో అఖిల్ గతేడాది నటించిన ఏజెంట్ సినిమా భారీ స్థాయిలో నష్టాలను మిగిల్చింది.

మరో హీరో (Varun Tej) వరుణ్ తేజ్ కు కూడా ఈ మధ్య కాలంలో సరైన సక్సెస్ దక్కలేదు. గని సినిమా ప్రేక్షకులను తీవ్రస్థాయిలో నిరాశపరిచింది. మట్కా, ఆపరేషన్ వాలంటైన్ సినిమాలలో నటిస్తున్న వరుణ్ తేజ్ ఈ రెండు సినిమాలతో భారీ విజయాలను సొంతం చేసుకోవాలని అభిమానులు మనస్పూర్తిగా కోరుకుంటున్నారు. మరో హీరో రామ్ నటించిన సినిమాలు బాగానే కలెక్షన్లను సాధిస్తున్నా రామ్ తర్వాత సినిమాలతో కెరీర్ బెస్ట్ హిట్లను సొంతం చేసుకోవాలని అభిమానులు భావిస్తున్నారు.

యంగ్ హీరోలు శర్వానంద్, నాగశౌర్యలకు సైతం ఈ మధ్య కాలంలో సరైన సక్సెస్ లేదు. ఈ ఇద్దరు హీరోలు కూడా భారీ విజయాలను సొంతం చేసుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు. 2024 ఎంతమంది హీరోలకు కలిసొస్తుందో చూడాల్సి ఉంది. సీనియర్ హీరోలలో కొంతమంది హీరోలు సక్సెస్ ట్రాక్ లో ఉండగా మరి కొందరు మాత్రం సక్సెస్ ట్రాక్ లో లేరు.

కొత్త కంటెంట్ తో ప్రేక్షకుల ముందుకు వస్తే విజయాలు సొంతమవుతాయని చెప్పవచ్చు. టాలెంట్ ఉన్న నవతరం ఉన్న డైరెక్టర్లకు ఛాన్స్ ఇస్తే బాగుంటుందని కామెంట్లు వినిపిస్తున్నాయి. 2024 సంవత్సరం ఎంతమంది సెలబ్రిటీలకు కలిసొస్తుందో చూడాల్సి ఉంది. తెలుగు రాష్ట్రాల ప్రేక్షకులు స్టార్ స్టేటస్ కంటే మంచి కంటెంట్ కు పట్టం కడుతున్నారు.

గుంటూరు కారం సినిమా రివ్యూ & రేటింగ్!

హను మాన్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘గుంటూరు కారం’ తో పాటు 24 గంటల్లో రికార్డులు కొల్లగొట్టిన 15 ట్రైలర్ల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus