ట్రాక్టర్ ఎక్కిన యాంకర్ సుదీప అలియాస్ పింకీ.. వైరల్ అవుతున్న ఫోటోలు..!

ఈమధ్య సోషల్ మీడియాలో నందమూరి హరికృష్ణ, వై.వి.ఎస్. చౌదరి కాంబినేషన్‌లో వచ్చిన ‘సీతయ్య’ సినిమాలోని ‘బస్సెక్కి వస్తావో.. బండెక్కి వస్తావో’ సాంగ్ బాగా వైరల్ అవుతోంది. స్టార్ హీరోల ఫ్యాన్స్ ఈ పాటకు తగ్గ విజువల్స్‌తో ఎడిట్ చేసి తెగ ట్రెండ్ చేస్తున్నారు. మరి వెరైటీగా ఉంటుంది అనుకుందేమో కానీ ఈ యాంకర్ మాత్రం ట్రాక్టర్ ఎక్కి సందడి చేస్తోంది..చైల్డ్ ఆర్టిస్టుగా పాపులర్ అయిన పింకీ అలియాస్ సుదీప తెలుసు కదా.. ప్రస్తుతం సీరియళ్లతో తెలుగు ప్రేక్షకులను అలరిస్తోంది.

సుదీప సోషల్ మీడియాలో తన పర్సనల్ అండ్ ప్రొఫెషన్‌కి సంబంధించిన అప్‌డేట్స్ అన్నీ నెటిజన్లతో షేర్ చేసుకుంటూ ఉంటుంది.. మధ్యలో కొన్నాళ్లు సినిమాల నుండి గ్యాప్ తీసుకున్న సుదీప.. బిగ్ బాస్ 6లో పార్టిసిపెట్ చేసింది కూడా.. కొంత బ్రేక్ తర్వాత తిరిగి వచ్చినా కానీ ప్రేక్షకులు తననింకా మర్చిపోలేదు. ‘నువ్వు నాకు నచ్చావ్’ పింకీగానే గుర్తు పెట్టుకున్నారు. అప్పటికీ ఇప్పటికీ ఏం మారలేదు అంటూ ఆశ్చర్యపోతున్నారు.

రీసెంట్‌గా పొలంలో ట్రాక్టర్ వెనక ఎక్కి నిలబడి తీసుకున్న పిక్స్ పోస్ట్ చేసింది పింకీ. విలేజ్‌లోని ఈ పిక్స్ నెటిజన్లను ఆకట్టుకుంటున్నాయి. తనను సీరియల్స్‌తో పాటు మళ్లీ సినిమాలు కూడా చెయ్యమని రిక్వెస్ట్ చేస్తున్నారు ఆడియన్స్. ఇన్‌స్టాగ్రామ్‌లో 51.8K మంది సుదీపను ఫాలో అవుతున్నారు.

ఆహ నా పెళ్లంట వెబ్ సిరీస్ రివ్యూ& రేటింగ్!
గాలోడు సినిమా రివ్యూ & రేటింగ్!

మసూద సినిమా రివ్యూ & రేటింగ్!
సూపర్ స్టార్ కృష్ణ ట్రెండ్ సెట్టర్ అనడానికి 10 కారణాలు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus