‘వి’ సినిమాకి ముందు నా మోకాలికి గాయమయ్యింది.. నొప్పిని కూడా ఎంజాయ్ చేశాను : సుధీర్ బాబు

  • September 6, 2020 / 11:51 AM IST

టాలీవుడ్లో ఉన్న హీరోల్లో సినిమా కోసం ఎంతైనా కష్టపడే హీరో సుధీర్ బాబు. ‘ఇతను మోస్ట్ అండర్రేటెడ్ హీరో… ఇతన్ని వాడుకోవాలే కానీ… ప్రేక్షకులను ఎంటర్టైన్ చెయ్యడానికి ఎంత రిస్కీ యాక్షన్ ఎపిసోడ్స్ అయినా చేస్తాడు. కరెక్ట్ సినిమా పడితే ఇతను నెక్స్ట్ లెవెల్లో ఉంటాడు. ఇతన్ని 100 శాతం డెడికేషన్ స్టార్ అనొచ్చు’ అని చాలా మంది దర్శకులు సుధీర్ బాబు గురించి చెప్పుకొచ్చారు. ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఓ వీడియోని చూస్తే అది నిజమే అని అందరూ ఒప్పుకుంటారు. ఆ వీడియో పోస్ట్ చేసింది కూడా సుధీర్ బాబునే..!

ఈ వీడియో చాలా మంది యువతకు ఎంతో స్ఫూర్తినిస్తుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఈ వీడియో ద్వారా సుధీర్ బాబు మాట్లాడుతూ …”నేను ఎంత కష్టపడ్డానో తెలియజేయడం కోసం ఈ వీడియో పెట్టడం లేదు. ఇలాంటి ఇబ్బందిని అనుభవిస్తున్న వారిలో స్ఫూర్తిని నింపేందుకు ఈ వీడియో ద్వారా ప్రయత్నిస్తున్నా…! ఎటువంటి కష్టమొచ్చినా చీకట్లో ఉండిపోకండి. వెలుగులోకి రావడానికి ప్రయత్నించండి. ప్రశ్నలకు లొంగిపోకండి.

‘వి’ చిత్రం మొదలయ్యే కొన్ని నెలల ముందు నా మోకాలుకు బలమైన గాయమైంది.ఆ సమయంలో నడవడానికి చాలా ఇబ్బంది పడ్డాను. అయినా సరే… నొప్పిని తట్టుకుంటూ నడిచేందుకు ప్రయత్నించాను, ఎన్నో వ్యాయామాలు, వర్కౌట్లు చేశాను. ఆ నొప్పి భరించడాన్ని కూడా ఎంజాయ్ చేశాను. నా మోటివేషన్ ఒక్కటే… నా సినిమా, నా ప్రేక్షకులు” అంటూ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారింది.

వి సినిమా రివ్యూ & రేటింగ్!
టాలీవుడ్ హీరోయిన్స్ రెమ్యూనరేషన్స్ లిస్ట్…!
ఆ చిత్రాలు పవన్ చేసి ఉంటే బాక్సాఫీస్ బద్దలు అయ్యేది..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus