Sudheer Babu vs Sushanth: శ్రీదేవి సోడా సెంటర్ వద్ద నో పార్కింగ్ వార్!

సినిమా పరిశ్రమలో ప్రతి శుక్రవారం సీన్ మారుతూ ఉంటుంది. కాగా సినిమా వాళ్లకు శుక్రవారం అనేది ముఖ్యమైన రోజు, ఇక ఆడియన్స్ కి అయితే పండుగ అనే చెప్పాలి. దాదాపుగా చాలా వరకు సినిమాలు పక్కాగా శుక్రవారం విడుదల అయ్యేలా పలువురు దర్శకనిర్మాతలు ప్లాన్ చేస్తూ ఉంటారు. ఇక చాలా గ్యాప్ తరువాత అటు సుధీర్ బాబు, ఇటు సుశాంత్ ఇద్దరూ కూడా ఈ శుక్రవారం టాలీవుడ్ బాక్సాఫీస్ బరిలో నిలుస్తున్నారు. విషయం లోకి వెళితే ఎల్లుండి శుక్రవారం వీరిద్దరూ నటిస్తున్న లేటెస్ట్ సినిమాలు ప్రేక్షకుల ముందుకు రానున్నాయి.

వాటిలో ముందుగా శ్రీదేవి సోడాసెంటర్ మూవీతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు సుధీర్. పలాస సినిమాతో అందరి నుండి మంచి ప్రశంసలు అందుకున్న కరుణ కుమార్ తీస్తున్న ఈ సినిమా లవ్, యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కినట్లు తెలుస్తుంది. ఇక ఇటీవల విడుదలైన ట్రైలర్ కి అందరి నుండి మంచి స్పందన లభించింది. అటు ఈ సినిమా ప్రమోషన్స్ కోసం సూపర్ స్టార్ మహేష్ ని, రెబల్ స్టార్ ప్రభాస్ ని దించారు మేకర్స్. అది సినిమాకి మంచి బజ్ ని అలానే హైప్ ని తెచ్చిపెట్టింది. ఇక గత ఏడాది స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన అలవైకుంఠపురములో సినిమాలో ఒక మంచి రోల్ చేసి అందరినీ ఆకట్టుకున్న సుశాంత్ నటిస్తున్న తాజా సినిమా ఇచ్చట వాహనములు నిలపరాదు.

వాస్తవ ఘటనల ఆధారంగా తెరకెక్కుతున్న ఈ యాక్షన్ ఎంటర్టైనర్ ని కరోనాకి ముందు చిత్రీకరణ మొదలెట్టారు. నిన్న విడుదలైన ట్రైలర్ అందరి నుండి బాగా రెస్పాన్స్ దక్కించుకోవడంతో తప్పకుండా విజయం తథ్యం అని మేకర్స్ ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. సినిమా కోసం హీరో సుశాంత్ ఎంతో కష్టపడ్డారని, తప్పకుండా మూవీ సక్సెస్ కొట్టడం ఖాయం అని, నిన్న జరిగిన ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పలువురు సినిమా ప్రముఖులు, యూనిట్ సభ్యులు చెప్పారు. మరి ఈ శుక్రవారం పోరులో అటు సుధీర్, ఇటు సుశాంత్ ఎంతవరకు సక్సెస్ కొడతారో చూడాలి.

Most Recommended Video

చాలా డబ్బు వదులుకున్నారు కానీ ఈ 10 మంది యాడ్స్ లో నటించలేదు..!
గత 5 ఏళ్లలో టాలీవుడ్లో రూపొందిన సూపర్ హిట్ రీమేక్ లు ఇవే..!
రాజ రాజ చోర సినిమా రివ్యూ& రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus