Sudheer Babu: సూప‌ర్ నేచుర‌ల్ మిస్ట‌రీ థ్రిల్ల‌ర్‌లో సుధీర్ బాబు..ఈసారైనా వర్కౌట్ అవుతుందా?

ఈ మధ్యనే సుధీర్ బాబు (Sudheer Babu) ‘హరోం హర’ (Harom Hara) అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. పాన్ ఇండియా ప్రాజెక్టుగా ఈ సినిమా మొదలైనప్పటికీ ఫైనల్ గా తెలుగు వెర్షన్ కే పరిమితమయ్యింది. సుధీర్ బాబు కెరీర్లోనే భారీ బడ్జెట్ తో రూపొందింది ఈ సినిమా. రూ.23 కోట్ల వరకు బడ్జెట్ పెట్టారు నిర్మాతలు. కానీ ఫైనల్ గా రూ.3 కోట్లు మాత్రమే రికవరీ అయ్యింది.కనీసం ఈ సినిమాకి ఓటీటీ బిజినెస్ కూడా జరగలేదు.

రిలీజ్ తర్వాత మంచి రేటు వస్తుందని మేకర్స్ కొన్ని ఆఫర్స్ ని హోల్డ్ లో పెట్టారు. ఫైనల్ గా వ్యూయర్ షిప్ బేస్ పైనే స్ట్రీమింగ్ ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇదిలా ఉండగా.. ఇప్పుడు సుధీర్ బాబు మరో పాన్ ఇండియా సినిమాలో నటించడానికి రెడీ అయ్యాడు. వెంట్ క‌ళ్యాణ్ ఈ చిత్రంతో ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతున్నాడు. ‘రుస్తుం’ ‘టాయ్‌లెట్‌: ఏక్ ప్రేమ్ క‌థ‌’ ‘ప్యాడ్ మ్యాన్‌’ ‘ప‌రి’ వంటి సక్సెస్ ఫుల్ మూవీస్ ని అందించిన ప్రేర‌ణ అరోరా స‌మ‌ర్ప‌ణ‌లో శివిన్ నార‌గ్‌, నిఖిల్ నంద‌, ఉజ్వ‌ల్ ఆనంద్ లు కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

ఇదొక సూప‌ర్ నేచుర‌ల్ మిస్టరీ థ్రిల్ల‌ర్ అని తెలుస్తుంది.ఇందులో ఓ బాలీవుడ్ హీరోయిన్ నటించే అవకాశాలు ఉన్నాయట. వచ్చే ఏడాది శివరాత్రి కానుకగా ఈ చిత్రాన్ని రిలీజ్ చేయాలనే టార్గెట్ తో షూటింగ్ ఫినిష్ చేయాలనే ఆలోచనలో చిత్ర బృందం ఉన్నట్టు తెలుస్తుంది. ఇప్పుడు లార్జర్ థెన్ లైఫ్ స్టోరీలకి మంచి డిమాండ్ ఉంది. ఈ ఏడాది ఆరంభంలో వచ్చిన ‘హనుమాన్’ (Hanu Man)కావచ్చు ఇటీవల వచ్చిన ‘కల్కి..’ (Kalki) కావచ్చు.. అలాంటి సినిమాలే. మరి ఈ జోనర్ సుధీర్ బాబుకి ఎంతవరకు కలిసొస్తుందో చూడాలి.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus