ప్రభాస్ లాంచ్ చేసిన సుధీర్ బాబు ‘హంట్’ ట్రైలర్

నైట్రో స్టార్ సుధీర్ బాబు హీరోగా నటించిన తాజా సినిమా ‘హంట్’. భవ్య క్రియేషన్స్ పతాకంపై ప్రముఖ నిర్మాత వి. ఆనంద ప్రసాద్ నిర్మించారు. మహేష్‌ దర్శకత్వం వహించారు. రిపబ్లిక్ డే కానుకగా జనవరి 26న థియేటర్లలో విడుదల కానుంది. ఈ రోజు ఉదయం 10.01 గంటలకు పాన్ ఇండియా డార్లింగ్, రెబల్ స్టార్ ప్రభాస్ సినిమా ట్రైలర్ విడుదల చేశారు. చిత్ర బృందానికి ఆల్ ది బెస్ట్ చెప్పడంతో పాటు సినిమా ఘన విజయం సాధించాలని ఆకాంక్షించారు.

‘హంట్’ సినిమాలో మెమరీ లాస్ అయిన అసిస్టెంట్ కమిషనర్ అర్జున్ పాత్రలో సుధీర్ బాబు నటించారు. ఆల్రెడీ విడుదలైన టీజర్ చూస్తే ఆ సంగతి తెలుస్తుంది. అందులో మెమరీ లాస్‌కు ముందు కలిసిన వ్యక్తులు, జరిగిన ఘటనలు అర్జున్‌కు గుర్తు లేవు కానీ… పోలీస్ ట్రైనింగ్, భాషలు, స్కిల్స్ గుర్తు ఉన్నాయని చెప్పారు. ఇక, ట్రైలర్ విషయానికి వస్తే…

”ఏ కేసును అయితే అర్జున్ మొదలుపెట్టి సాల్వ్ చేయలేకపోయాడో… అదే కేసును ఇప్పుడు ఈ అర్జున్ సాల్వ్ చేయాలి” అని శ్రీకాంత్ చెప్పే డైలాగుతో ట్రైలర్ స్టార్ట్ అయ్యింది. టీజర్‌లో కూడా ఆయన ఈ మాట చెప్పారు. ఆ కేసు ఏమిటన్నది ట్రైలర్‌లో చూపించారు. పట్టపగలు ఓ అసిస్టెంట్ కమిషనర్ హత్యకు గురవుతారు. ఆ కేసు ఇన్వెస్టిగేట్ చేసే క్రమంలో హీరోకు ఎటువంటి పరిస్థితులు ఎదురు అయ్యాయి? ఏం చేశారు? అనేది ఆసక్తికరం.

మెమరీ లాస్‌కు ముందు జరిగిన ఘటనలు, వ్యక్తులు గుర్తు లేకపోవడంతో అర్జున్ కొత్తగా కేసును ఇన్వెస్టిగేట్ చేయడం స్టార్ట్ చేస్తారు. రోజుకు ఒక కొత్త అనుమానితుడి పేరు వస్తుంది. దానికి తోడు 18 రోజుల్లో కేసును పరిష్కరించాలని టార్గెట్. అప్పుడు అర్జున్ ఏం చేశాడు? థ్రిల్లింగ్ జర్నీగా ఉండబోతుందని ట్రైలర్ చూస్తే అర్థం అవుతోంది.

కంప్లీట్ ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్, 18 రోజుల్లో సంపాదించిన క్లూస్ శ్రీకాంత్‌కు సుధీర్‌ బాబు ఎందుకు ఇచ్చారు? రెండూ ఒకేసారి చదవమని ఎందుకు చెప్పారు? ఆ బ్లాంక్ పేజీ ఏమిటి? అనేది మరింత క్యూరియాసిటీ పెంచింది. హాలీవుడ్ స్థాయిలో యాక్షన్ స్టంట్స్ ఉన్నాయి. నేపథ్య సంగీతం, సినిమాటోగ్రఫీ బావున్నాయి.

”నువ్వు లూజ్ అయ్యింది నీ మెమరీ మాత్రమే… నీ ఆలోచనా శక్తి కాదు” అని సుధీర్ బాబుతో శ్రీకాంత్ చెప్పే మాట హీరో బుద్ధి బలాన్ని చెబుతోంది. మాంచి యాక్షన్ థ్రిల్లర్ అని తెలుస్తోంది.

చిత్ర నిర్మాత వి. ఆనంద ప్రసాద్ మాట్లాడుతూ “ట్రైలర్ విడుదల చేసిన ప్రభాస్ గారికి చాలా థాంక్స్. కంటెంట్ బేస్డ్ హై వోల్టేజ్ యాక్షన్ థ్రిల్లర్ చిత్రమిది. మేం ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంటర్టైనర్‌గా తెరకెక్కించాం. టీజర్, ట్రైలర్‌లో యాక్షన్ సీక్వెన్సులు చాలా బావున్నాయని ప్రేక్షకులు చెబుతున్నారు. మార్వెల్ స్టూడియోస్ నిర్మించిన పలు చిత్రాలకు వర్క్ చేసిన రేనాడ్ ఫవెరో, బ్రయాన్ విజియర్ ‘హంట్’లో స్టంట్స్ కంపోజ్ చేశారు. ‘జాన్ విక్ 4’కి కూడా వాళ్ళే స్టంట్ కొరియోగ్రాఫర్స్. ఆల్రెడీ స్టంట్ మేకింగ్ వీడియో విడుదల చేశాం. హీరో సుధీర్ బాబు గారు, టీమ్ ఎంత కష్టపడినదీ ఆ వీడియోలో చూపించాం. దానికీ మంచి స్పందన లభిస్తోంది. రేనాడ్ ఫవెరో, బ్రయాన్ విజియర్ వర్క్ చేసిన ఫస్ట్ ఇండియన్ ఫిల్మ్ ‘హంట్’. వాళ్ళ యాక్షన్ కొరియోగ్రఫీ సినిమాకి హైలైట్ అవుతుంది. జనవరి 26న సినిమాను థియేటర్లలో విడుదల చేస్తున్నాం” అని అన్నారు.

‘హంట్’ సినిమాలో నటీనటులు:
సుధీర్ బాబు కథానాయకుడిగా నటిస్తున్న ఈ సినిమాలో శ్రీకాంత్, భరత్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. మైమ్ గోపి, కబీర్ దుహన్ సింగ్, మౌనిక రెడ్డి, గోపరాజు రమణ, మంజుల ఘట్టమనేని, సంజయ్ స్వరూప్, చిత్రా శుక్ల, సుపూర్ణ మల్కర్, రవి వర్మ, ‘జెమినీ’ సురేష్, అభిజీత్ పూండ్ల, కోటేష్ మన్నవ, సత్య కృష్ణన్ తదితరులు ఇతర తారాగణం. అప్సరా రాణి ప్రత్యేక గీతం చేశారు.

 

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus