Harom Hara: ‘హరోం హర’ సుధీర్ బాబుని నమ్మి అంత పెట్టారా?

టాలీవుడ్ హీరో సుధీర్ బాబు (Sudheer Babu)  … మహేష్ బాబు (Mahesh Babu) బావగా నెట్టుకొస్తున్నాడు తప్ప, హీరోగా మార్కెట్ ఇంకా ఏర్పరుచుకోవడంలో విఫలమయ్యాడు. ఒక్క ‘ప్రేమకథా చిత్రం’ (Prema Katha Chitram) తీసేస్తే ఇతను నటించిన ఒక్క సినిమా కూడా రూ.10 కోట్ల షేర్ ను రాబట్టలేదు అంటే అతిశయోక్తి అనిపించుకోదు. ‘సమ్మోహనం’ (Sammohanam)  ‘భలే మంచి రోజు’ (Bhale Manchi Roju)  వంటి సినిమాలకి హిట్ టాక్ వచ్చినా.. వాటికి పెట్టిన బడ్జెట్ కి, వచ్చిన కలెక్షన్స్ కి అలా సరిపోయింది. అంతే తప్ప లాభాలు వచ్చిన పరిస్థితి లేదు.

అయితే ‘హరోం హర’ (Harom Hara)   సినిమాకి ఏకంగా రూ.23 కోట్లు ఖర్చు చేశారట. జ్ఞాన సాగర్ (Gnanasagar Dwaraka) డైరెక్ట్ చేసిన ఈ సినిమాని సుమంత్, సుబ్రహ్మణ్యం..లు కలిసి నిర్మించారు. జూన్ 14 న రిలీజ్ అయ్యింది ఈ సినిమా. మొదటిరోజు ఈ సినిమాకి పాజిటివ్ టాక్ వచ్చింది కానీ.. ఓపెనింగ్స్ మాత్రం అంతంత మాత్రమే వచ్చాయి. రెండో రోజు నుండి అయితే కలెక్షన్స్ ఊహించని విధంగా తగ్గిపోయాయి. ఆదివారం, బక్రీద్ సెలవులను కూడా ఈ మూవీ వాడుకోలేకపోయింది.

థియేట్రికల్ గా ఈ సినిమా రూ.3 కోట్ల షేర్ ను కూడా రాబట్టలేకపోయింది. పోనీ నాన్ థియేట్రికల్ రైట్స్ రూపంలో ఏమైనా వచ్చాయా అంటే అదీ లేదు. ఓటీటీ బిజినెస్ అవ్వలేదు. డిస్కషన్స్ జరిపారు. వ్యూయర్ షిప్ పద్ధతిలో ఇచ్చేసి వచ్చింది తీసుకోవాలి తప్ప.. వేరే ఆప్షన్ లేదు. శాటిలైట్ బిజినెస్ కూడా జరగలేదు. మొత్తంగా హిట్టు టాక్ వచ్చిన సినిమాని కూడా పుష్ అవ్వలేదు అంటే.. అతని ఇమేజ్ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus