కొరియన్‌ రీమేక్‌ల స్పెషలిస్ట్‌ సుధీర్‌ భవిష్యత్తు ఆ ఇద్దరి మీదే!

  • May 10, 2021 / 02:28 PM IST

కొరియన్‌ సినిమా రీమేక్‌లు తెలుగులోకి చక్కగా ఎత్తి దింపేయాలంటే సుధీర్‌ వర్మ బెస్ట్‌ అని అంటుంటారు. ఆయన ట్రాక్‌ రికార్డ్‌ చూస్తే ఈ విషయం మనకు క్లియర్‌గా అర్థమైపోతుంది. ఇప్పటి వరకు ఆయన చేసిన సినిమాలు ఫలానా సినిమాకి రీమేక్‌ అని చెప్పరు కానీ.. ఆ సినిమా స్ఫూర్తి మాత్రం ఉంటుంది. ఆయన హీరోల లుక్‌, కథలో గ్రే షేడ్‌… ఇలా అన్నీ కొరియన్‌ సినిమా వాసన ఉంటుంది. అయితే మన నేటివిటీ ఆ సినిమాల్లో యాడ్‌ చేసి ఓకే చేయించుకోవడం ఆయన టాలెంట్. ఇప్పుడు అదే స్పీడులో మరో రీమేక్‌కు సిద్ధమయ్యాడు సుధీర్‌.

సురేశ్‌ ప్రొడక్షన్స్‌ బ్యానర్‌లో సుధీర్‌ వర్మ ఓ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఆ సినిమాకు‘శాకినీ ఢాకినీ’ అనే పేరు పెట్టారు అని సమాచారం. ఈ సినిమా ‘మిడ్‌నైట్‌ రన్నర్స్‌’ అనే కొరియన్‌ సినిమాకు రీమేక్‌. ఇందులో హీరోయిన్లుగా ఇప్పటికే రెజీనా, నివేదా థామస్‌ నటిస్తున్నారట. ఇందులో వీరి పాత్రలే సినిమాకు కీలకంగా ఉంటాయట. దీని కోసం కొరియాకు చెందిన యాక్షన్‌ కొరియోగ్రాఫర్ల దగ్గర రెజీనా, నివేదా యాక్షన్‌ సీన్లలో శిక్షణ కూడా తీసుకున్నారట.

సుధీర్‌ వర్మ కెరీర్‌ చూస్తే ‘స్వామి రా రా’, ‘ దోచేయ్‌’, ‘కేశవ’, ‘రణరంగం’ ఇలా అన్నీ హీరోను మెయిన్‌గా పెట్టి తీసిన సినిమాలే. అన్నింటిలోనూ క్రైమ్‌, థ్రిల్లర్‌ అంశాలు కనిపిస్తాయి. ఇప్పుడు ‘శాకినీ ఢాకినీ’ కూడా అలానే ఉంటుందట. అయితే పేర్లు చూస్తే రాక్షసులవిలా ఉన్నాయి. ఎందుకు ఈ సినిమాకు ఆ పేరు పెట్టారు అనేదే కీలకమంటున్నారు. ఏదైతేముంది సుధీర్‌ వర్మ మంచి సినిమా తీయాలి, హిట్‌కొట్టాలి. మళ్లీ ఇంకో మంచి కొరియన్‌ మూవీ మన దగ్గరకు తీసుకురావాలి.

Most Recommended Video

థ్యాంక్యూ బ్రదర్ సినిమా రివ్యూ & రేటింగ్!
వెంకీ టు సాయి తేజ్.. అందరూ అలా కష్టపడినవాళ్ళే..!
ఈ 12 మంది హీరోయిన్లు తక్కువ వయసులోనే పెళ్లి చేసుకున్నారు..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus