మరో సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన రవితేజ
- June 14, 2017 / 01:56 PM ISTByFilmy Focus
మాస్ మహారాజ్ రవితేజ 2016లో ఏ సినిమా చేయలేదు. ఈ ఏడాది రెండు సినిమాలకు ఒకే చెప్పారు. నూతన దర్శకుడు విక్రమ్ సిరికొండతో “టచ్ చేసి చూడు” సినిమా చేస్తున్నారు. లక్ష్మీ నరసింహ ప్రొడక్షన్స్ పతాకంపై నల్లమలుపు శ్రీనివాస్ (బుజ్జి), వల్లభనేని వంశీ నిర్మిస్తున్న ఈ మూవీ వేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఈ చిత్రంతో పాటు పటాస్’, ‘సుప్రీమ్’ విజయాలతో దర్శకుడిగా నిరూపించుకున్న అనిల్ రావిపూడి తో ‘రాజా ది గ్రేట్’ చేస్తున్నారు. ఏకకాలంలో రెండింటిని పూర్తి చేస్తున్న మాస్ మహారాజ్ తాజాగా మరో కథకు ఒకే చెప్పినట్లు తెలిసింది.
‘స్వామిరారా’, ‘కేశవ’ సినిమాలతో దర్శకుడిగా తన సత్తా చాటుకున్న సుధీర్ వర్మ, ఇటీవల రవితేజను కలుసుకుని ఒక కథను వినిపించాడట. ఆ కథ కొత్తగా.. తన పాత్ర వైవిధ్యంగా అనిపించడంతో వెంటనే రవితేజ ఓకే చెప్పేశాడని ఫిలిం నగర్ వాసులు చెబుతున్నారు. ఈ సినిమాకి సంబంధించిన పనుల్లోనే సుధీర్ వర్మ ఉన్నట్టుగా తెలిపారు. ఒక ఏడాది సినిమాలు లేక ఇబ్బంది పడ్డ అభిమానులకు వరుసగా రవితేజ సినిమాలను అందించనున్నారు.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

















