Sudigali Sudheer: హాట్ టాపిక్ గా మారిన సుడిగాలి సుధీర్ ఎమోషనల్ పోస్ట్.. అసలు మేటర్ ఏంటి?

ఓ మెజీషియన్ గా కెరీర్ ను ప్రారంభించిన సుధీర్.. ‘జబర్దస్త్’ కామెడీ షో ద్వారా ప్రజాధారణ పొందాడు. ఈ షోలో ఇతని స్కిట్స్ చాలా పాపులర్. ఎక్కువ స్కిట్స్ గెలిచిన కెప్టెన్ గా రికార్డు సృష్టించాడు సుధీర్. అంతేకాదు ఇతని స్టైల్, డాన్స్ లు.. అన్నీ కూడా ఆడియన్స్ కు బాగా ఇష్టం. మరీ ముఖ్యంగా రష్మీతో ప్రేమ వార్తలతో ఇతను బాగా పాపులర్ అయ్యాడు. నిజంగానే వీరిద్దరూ ప్రేమించుకుంటున్నట్టు ప్రచారం జరుగుతుంది కానీ..

ఇన్సైడ్ టాక్ ప్రకారం అలాంటిది ఏమీ లేదు అని అంటున్నారు. సరే ఈ విషయాన్ని పక్కన పెడితే… సుధీర్ ఇమేజ్ పెరగడానికి రష్మీ కారణమని చెప్పక తప్పదు. ఇదిలా ఉండగా.. సుధీర్ ఇప్పుడు సినిమాల్లో కూడా నటిస్తూ బిజీగా గడుపుతున్నాడు. కొంతమంది స్టార్ ఫ్యామిలీ నుండి వచ్చిన హీరోలకు కూడా దక్కని క్రేజ్ ఇతనికి దక్కింది. ఇతను హీరోగా నటించిన ‘ సాఫ్ట్ వేర్ సుధీర్’ ‘గాలోడు’ రెండు సినిమాలు కూడా బాక్సాఫీస్ వద్ద బాగా పెర్ఫార్మ్ చేశాయి.

మరోపక్క ‘ఆహా’ కూడా ఓ కామెడీ షోకు హోస్ట్ గా వ్యవహరిస్తున్నాడు సుధీర్. ఇలా బిజీగా గడుపుతున్న సుధీర్.. కాస్త టైం దొరికితే ఫ్యామిలీతో గడపడానికి ఇష్టపడుతుంటాడు. ఇతనికి రోహన్ అనే తమ్ముడు ఉన్న సంగతి తెలిసిందే. రోహన్ కు ఆల్రెడీ రమ్య అనే అమ్మాయితో పెళ్లయ్యింది. ఓ పాప కూడా జన్మించింది.

తాజాగా ఈ పాపకు సంబంధించిన ఫోటోని షేర్ చేసిన సుధీర్.. ‘నా ఆఖరి శ్వాస వరకు నేను ప్రేమించే పర్సన్’ అంటూ ఎమోషనల్ పోస్ట్ పెట్టాడు. ఆ పోస్ట్ ఇప్పుడు వైరల్ గా మారింది.

18 పేజెస్ సినిమా రివ్యూ& రేటింగ్!
ధమకా సినిమా రివ్యూ& రేటింగ్!

ఈ ఏడాది ఓవర్సీస్ లో 1 మిలియన్ కొట్టిన సినిమాల లిస్ట్..!
టాప్ 10లో తెలుగు ఇండస్ట్రీ నుండి ఎన్ని సినిమాలు ఉన్నాయంటే..?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus