Sudigali Sudheer: మరదలితో పెళ్లికి సిద్ధమైన సుధీర్… ఇందులో నిజమెంత?

బుల్లితెర కమెడియన్ గా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నటువంటి సుడిగాలి సుదీర్ అదే క్రేజ్ తో వెండితెర సినిమా అవకాశాలను కూడా అందుకున్నారు. ఇలా వెండితెరపై వరుస సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్నటువంటి సుధీర్ ప్రస్తుతం బుల్లితెర కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. ఇలా బుల్లితెర కార్యక్రమాలకు దూరమై వరుస సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నటువంటి సుధీర్ గురించి తాజాగా ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

సుధీర్ (Sudigali Sudheer) బుల్లితెర కార్యక్రమాలలో సందడి చేసే సమయంలో యాంకర్ రష్మితో ఈయనకు ఏదో సంబంధం ఉందంటూ పెద్ద ఎత్తున వార్తలు వచ్చేవి వీరిద్దరి ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ చాలా మంచిగా వర్క్ అవుట్ అవ్వడంతో వీరి చేత ఎన్నో కార్యక్రమాలలో సందడి చేయించేవారు అయితే ఇది చూసినటువంటి అభిమానులు ఇద్దరు ప్రేమలో ఉన్నారంటూ వార్తలు సృష్టించారు. ఇలా రష్మీ సుధీర్ ప్రేమ గురించి ఎన్నో వార్తలు వచ్చాయి. ఇలా తమ గురించి వచ్చే వార్తలను ఎప్పటికప్పుడు ఖండిస్తూ ఉన్నప్పటికీ నిజజీవితంలో కూడా వీరిద్దరూ ఇలాగే ఉంటే చాలా చూడముచ్చటగా ఉంటుందని భావించారు.

అయితే కొద్దిరోజుల క్రితం సుధీర్ తన సమీప బంధువుల అమ్మాయి వరుసకు మరదలు అయ్యే అమ్మాయిని పెళ్లి చేసుకోబోతున్నారంటూ వార్తలు వచ్చాయి. ఇలా గతంలో సుధీర్ పెళ్లి గురించి వార్తలు రాగా తాజాగా ఆ అమ్మాయితో సుధీర్ కు నిశ్చితార్థం జరిగిందని తెలుస్తోంది. ఇలా సుధీర్ రహస్యంగా తనని నిశ్చితార్థం చేసుకున్నారని త్వరలోనే వీరిద్దరి వివాహం కూడా జరగబోతుందని వార్తలు వస్తున్నాయి.

ఇప్పటికే వీరిద్దరి పెళ్లి కూడా ఫిక్స్ చేశారని తెలుస్తుంది. ఇక త్వరలోనే వీరి వివాహం కూడా జరగబోతుందన్న వార్త వైరల్ గా మారడంతో ఎంతోమంది సుధీర్ రష్మీ అభిమానులు సుధీర్ ఇలా పెళ్లి చేసుకుంటే రష్మీ పరిస్థితి ఏంటి అంటూ ప్రశ్నిస్తున్నారు.అయితే సుదీర్ పెళ్లి గురించి గత రెండు రోజులుగా ఈ వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అయినప్పటికీ ఈ వార్తల పై సుధీర్ ఏ విధంగాను స్పందించకపోవడం గమనార్హం.

స్పై సినిమా రివ్యూ & రేటింగ్!

సామజవరగమన సినిమా రివ్యూ & రేటింగ్!
వివాదాలకు కేరాఫ్ అడ్రస్ మారిన విజయ్ దళిపతి సినిమాలు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus