బుల్లితెరతో ప్రేక్షకులకు సుడిగాలి సుధీర్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. టీవీల్లో స్టార్‌గా ఎదిగిన తర్వాత కథానాయకుడిగా మారాడు. ‘గాలోడు’ సినిమాకు మంచి టాక్ వచ్చింది. ఆ తర్వాత వరుస సినిమాలు ఓకే చేయలేదు. గతంలో చేసిన ‘కాలింగ్ సహస్ర’ సినిమానే విడుదలకు సిద్ధం చేశాడు. ఈ సినిమా విడుదల సందర్భంగా సుధీర్ మాట్లాడుతూ ‘గాలోడు’ తర్వాత జరిగిన కొన్ని ఆసక్తికర విషయాలను చెప్పుకొచ్చాడు. ‘కాలింగ్ సహస్ర’ సినిమా సస్పెన్స్ థ్రిల్లర్ తరహా కథ అని, నేరం, ప్రేమ, డార్క్ వెబ్ లాంటి అంశాల కాంబినేషన్‌లో మూడు షేడ్స్‌లో ఉంటుంది అని చెప్పాడు.
‘గాలోడు’ సినిమా టైమ్‌లోనే ఈ సినిమా ఓకే చేశాను అని చెప్పిన (Sudigali Sudheer) సుధీర్… ఆ సినిమా ఇచ్చిన ఇమేజ్‌కు ఈ కథకు సంబంధం ఉండదు అని చెప్పాడు. రెండు వేర్వేరు రకాల కథలని, విభిన్నమైన కథలు ఓకే చేసే క్రమంలోనే ఈ సినిమా చేశానని చెప్పాడు. నన్ను నేను తెరపై కొత్తగా చూసుకున్న ఫీలింగ్ వచ్చిందని చెప్పాడు. ‘జబర్దస్త్’ నుండి రావడం వల్ల తాను వింటున్న కథల్లో ఆ ఇమేజ్ ప్రభావం కనిపిస్తోందని చెప్పాడు.
‘జబర్దస్త్’ తరహాలో కామెడీ కథ చేస్తే… ఇక్కడా కామెడీ, అక్కడా కామెడీ కొత్తగా ఏమీ లేదు అంటారు అని… అందుకే కొత్త తరహా కథలు చేస్తున్నానని చెప్పాడు. ‘గాలోడు’ సినిమా తర్వాత కొత్త సినిమాల కోసం కథలు వింటున్న సమయంలో ఆరోగ్య సమస్య వచ్చిందని చెప్పాడు సుధీర్. ఎక్కువ ఒత్తిడి తీసుకోవడం వల్ల అలా అయ్యిందని డాక్టర్లు చెప్పారని, దాంతో కోలుకున్నాక మళ్లీ సినిమాలు చేశానని చెప్పాడు.
అయితే ‘గాలోడు’ సినిమా తర్వాత దాదాపు 130 కిపైగా కథలు విన్నాను అని చెప్పాడు. అలా ‘గోట్’ సినిమా ఎంచుకున్నాను అని చెప్పాడు. అయితే సుధీర్ లాంటి కొత్త యాక్టర్‌కు ఇన్ని కథలు చెప్పారా? అసలు సాధ్యమేనా లాంటి ప్రశ్నలు సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి.
యానిమల్ సినిమా రివ్యూ & రేటింగ్!
దూత వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
‘వీరమల్లు’ టు ‘ ఆర్.టి.జి.ఎం 4’ హోల్డ్ లో పడిన 10 ప్రాజెక్టులు ఇవే..!