తక్కువ సినిమాల్లోనే నటించినా నటుడిగా ఊహించని స్థాయిలో పాపులారిటీని సంపాదించుకున్న వాళ్లలో సుహాస్ ఒకరనే సంగతి తెలిసిందే. తాజాగా అలీతో సరదాగా షోకు హాజరైన సుహాస్ నేను డిగ్రీ చదివానని ఒక యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రతిభను నిరూపించుకునే అవకాశం దక్కిందని అన్నారు. కలర్ ఫోటోకు జాతీయ అవార్డ్ వచ్చిన సమయంలో సందీప్ రాజ్ ఫోన్ చేసి చెబితే మొదట ప్రాంక్ అనుకున్నానని సుహాస్ తెలిపారు. కలర్ ఫోటో మూవీకి అవార్డ్ వచ్చిన రోజును మరిచిపోలేనని సుహాస్ చెప్పుకొచ్చారు.
కలర్ ఫోటోలో హీరో అని చెప్పి ఎవరైనా నెగటివ్ గా కామెంట్ చేస్తే డిస్టబ్ అవుతానని ఆ విషయాన్ని ఎక్కడా చెప్పలేదని సుహాస్ అన్నారు. కలర్ ఫోటో ఇచ్చిన సక్సెస్ వల్ల ప్రస్తుతం ఆరు సినిమాలలో హీరోగా నటిస్తున్నానని సుహాస్ చెప్పుకొచ్చారు. 2016 సంవత్సరంలో సినిమా ఆఫర్లు రాకపోవడంతో డబ్బులకు చాలా ఇబ్బంది పడ్డానని సుహాస్ అన్నారు. ఆ సమయంలో మా అన్నయ్య ఫ్రెండ్ ను కలిసి డబ్బులు అడగటానికి మొహమాటపడ్డానని సుహాస్ చెప్పుకొచ్చారు.
నా అవస్థను గమనించి ఆయన 500 రూపాయల నోటు నా చేతిలో పెట్టాడని ఆ నోటును చూస్తూ మూడు గంటల పాటు ఏడ్చానని సుహాస్ పేర్కొన్నారు. కలర్ ఫోటో మూవీ చూసిన వెంటనే నాన్నగారు ఫోన్ చేసి అభినందించారని సుహాస్ చెప్పుకొచ్చారు. నాకు మంచి నటుడిగా గుర్తింపు తెచ్చుకోవడమే కావాలని ఆయన తెలిపారు. ప్రత్యేకంగా హీరో పాత్రలే చేయాలని ఏమీ లేదని సుహాస్ అన్నారు.
కలర్ ఫోటో మూవీలో కలర్ ను ప్రధానాంశంగా చూపించడం నాకు ఎంతగానో నచ్చిందని సుహాస్ చెప్పుకొచ్చారు. నిజ జీవితంలో నాకు ఎదురైన అనుభవాల సారాంశాన్ని కలర్ ఫోటో మూవీలో చూపించారని ఆయన అన్నారు. ఒక సినిమాలో పాత్ర ఉందని చెబితే వెళ్లానని అక్కడికి వెళ్లాక పాత్ర నాకు సూట్ కాదని చెప్పి పంపించారని ఆయన అన్నారు.