తన పెళ్లి వెనుక కారణాన్ని చెప్పిన సుహాసిని!

చిరంజీవి, బాలకృష్ణ వంటి స్టార్ హీరోలతో నటించి సుహాసిని మంచి విజయాలను అందుకున్నారు. స్కిన్ షోకి దూరంగా ఉంటూ అభినయంతో అభిమానులను సొంతం చేసుకున్న ఈ నటి… తమిళ డైరక్టర్ మణిరత్నాన్ని పెళ్లిచేసుకున్న సంగతి తెలిసింది. వీరిద్దరూ కలిసి మెలిసి జీవిస్తున్నారు. కొన్నేళ్ల క్రితం జరిగిన తమ పెళ్లి గురించి ఈరోజు సుహాసిని గుర్తుచేసుకున్నారు. తాను నటిగా మంచి రేంజ్ లో ఉన్నప్పుడు పెళ్లిచేసుకోవడానికి గల కారణాన్ని వెల్లడించారు. ఆణిముత్యాల్లాంటి సినిమాలను తెరకెక్కించిన కె .బాలచందర్‌ 88వ జయంతిని సోమవారం ఆయన కూతురు పుష్పాకందసామి, కుటుంబ సభ్యులు స్థానిక సాలిగ్రామంలోని గోల్డెన్‌ ప్యారడైజ్‌ మండపంలో నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో నటుడు నాజర్, సుహాసిని, కరుపళనీయప్పన్, వసంత్, పూర్ణిమాభాగ్యరాజ్‌ సినీ ప్రరముఖులు పాల్గొని బాలచందర్‌ చిత్ర పటానికి పుష్పాంజలి ఘటించారు. అనంతరం సుహాసిని మాట్లాడుతూ బాలచందర్‌ ఒత్తిడి కారణంగానే తాను పెళ్లి చేసుకున్నానని అన్నారు. తన చెల్లెలికి వివాహం చేస్తున్న సమయంలో తననూ పెళ్లి చేసుకోమని ఒత్తిడి చేసింది ఆయనేనని తెలిపారు. ఆయన చెప్పడంతోనే తాను పెళ్లి చేసుకున్నానని సుహాసిని అన్నారు. “దర్శకుడంటే అది బాలచందర్‌. మా విజయ సోపానాలన్నింటికీ ఆయనే కారణం.” అని సుహానికి బాలచందర్ పై ఉన్న అభిమానాన్ని మాటల ద్వారా వెల్లడించారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus