ఆ డైరెక్టర్ ఎక్కడ మొదలు పెట్టాడో..తిరిగి అక్కడికే వచ్చి చేరాడుగా..!

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం కొరటాల శివ డైరెక్షన్లో ‘ఆచార్య’ చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం పూర్తయిన తరువాత ‘లూసిఫర్’ రీమేక్ లో నటించాలని ప్లాన్ చేసుకున్నాడు. మలయాళంలో సూపర్ హిట్ అయిన ‘లూసిఫర్’ రీమేక్ బాధ్యతలను.. ‘సాహో’ దర్శకుడు సుజీత్ కు అప్పగించాడు చిరు. తెలుగు ప్రేక్షకుల నేటివిటీకి తగినట్టుగా స్క్రిప్ట్ లో మార్పులు కూడా చేసి మెగాస్టార్ కు వినిపించాడట దర్శకుడు సుజీత్. ఈ యంగ్ డైరెక్టర్ రైటింగ్ మెగాస్టార్ కు నచ్చిందట కానీ.. ‘అది నాకు సెట్ అవ్వదు’ అని మొహమాటం లేకుండా సుజీత్ కు చెప్పేశారట మెగాస్టార్.

‘ఆచార్య’ పూర్తయ్యాక చూద్దాం అని మొహమాటానికి ఓ మాట అనేసి సైడ్ అయిపోయాడట చిరు. దీంతో ఈ ప్రాజెక్టు ఎలాగూ సెట్ అవ్వదు అని సుజీత్ కు అర్ధమైపోయినట్టు ఉంది. అందుకే మళ్ళీ ‘యూవీ క్రియేషన్స్’ వారి వద్దకే వచ్చేశాడు. సుజీత్ తన మొదటి రెండు చిత్రాలు అయిన ‘రన్ రాజా రన్’, ‘సాహో’ లను ఇదే బ్యానర్ లో చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు తన దగ్గర ఉన్న ఓ స్క్రిప్ట్ ను.. నిర్మాతలైన వంశీ, ప్రమోద్ లకు వినిపించాడట.

వాళ్ళు కూడా దీనికి ఓకే చెప్పేశారని తెలుస్తుంది. గోపీచంద్ తో ఈ ప్రాజెక్టు పట్టాలెక్కించాలని వారు ప్లాన్ చేస్తున్నారట. ఒక వేళ గోపి డేట్స్ ఖాళీ లేకపోతే శర్వానంద్ తో అయినా ఈ ప్రాజెక్టు పట్టాలెక్కించాలని వారు ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. ఈలోపు ఈ యంగ్ డైరెక్టర్(సుజీత్) తన పెళ్లి పనులు అన్నీ పూర్తి చేసుకుని వస్తాడని తెలుస్తుంది.

Most Recommended Video

పవర్ స్టార్ సినిమా రివ్యూ & రేటింగ్!
ఎస్.ఎస్.రాజమౌళి సినిమాల IMDB రేటింగ్స్!
తెలుగు సినిమాల్లో నటించిన 27 బాలీవుడ్ హీరోయిన్లు ఎవరో తెలుసా?

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus