శిష్యుడికి ఉప్పెనంత ప్రేమతో!

గురువు దగ్గర విద్య నేర్చుకున్న తర్వాత ఆ శిష్యుడు ప్రయోజకుడైతే ఆ గురువు ఆనందమే వేరు.. వీడు నా శిష్యుడు అంటూ గర్వంగా చెప్పుకుంటారు.. ఇప్పుడు ప్రముఖ దర్శకుడు సుకుమార్ అదే ఆనందంలో వున్నాడు.. ఉప్పెనసినిమాతో ప్రేక్షకుల అభినందనలతో పాటు విమర్శకుల ప్రశంసలు పొందుతున్న దర్శకుడు బుచ్చిబాబు, బ్రిలియంట్ డైరెక్టర్ సుకుమార్ దగ్గర దర్శకత్వ శాఖలో శిక్షణ పొందాడు.. సుకుమార్ తరహాలోనే ఉప్పెన రూపంలో ఓ విభిన్నమైన, సాహసోవంతమైన, అందమైన ప్రేమకథను ఓ ప్రేమకావ్యంలా మలిచాడు..ఈ చిత్రం ప్రేక్షకుల ఆదరణ.. వసూళ్ల సునామీతో దూసుకుపోతుంది. బుచ్చిబాబు నాపెద్ద కొడుకు, నేను పుత్రోత్సహాంలో వున్నాను.. అంటూ వేదికపై చెప్పిన దర్శకుడు సుకుమార్ బుచ్చిబాబుకు ప్రేమతో రాసిన ఓ లేఖ సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది.

నువ్వు నన్ను గురువును చేసే సరికి… నాకు నేను శిష్యుడినై పోయాను. ఇంత గొప్ప సినిమా తీయడానికి నువ్వు నా దగ్గర ఏం నేర్చుకున్నావా…?? అని.. నాకు నేను శిష్యుడిని అయిపోతే తప్ప అదేంటో తెలుసుకోలేను. నాలోకి నన్ను అన్వేషించుకునేలా చేసిన సానా బుచ్చిబాబును ఉప్పెనంత ప్రేమతో అభినందిస్తూ.. ఇట్లు సుకుమార్ ఇంకో శిష్యుడు – సుకుమార్ అంటూ సకుమార్ రాసిన ఈ లేఖ అందరిని అలరిస్తుంది. ఓ శిష్యుడి పట్ల గురువుగారి ప్రేమను చూసి అందరూ సుకుమార్‌పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. అంతేకాదు ఓ శిష్యుడిని దర్శకుడి చూడాలనే తపన, అతని సినిమా కోసం ఓ గురువు ప్రేమ, ఇదంతా సినీ పరిశ్రమలో చాలా అరుదు అంటున్నారు అందరూ.

Most Recommended Video

ఉప్పెన సినిమా రివ్యూ & రేటింగ్!
ఈ 20 సినిమాలకి ఊరి పేర్లనే పెట్టారు..అయితే ఎన్ని హిట్ అయ్యాయి
తెలుగులో క్రేజ్ ఉన్న ఈ 10 యాంకర్ల వయసు ఎంతో మీకు తెలుసా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus