Sukumar,Mahesh: ‘1’ తర్వాత అలా ఆగింది.. ఇప్పుడు ఉంటుందా!

మహేష్‌బాబును నెవర్‌ బిఫోర్‌గా చూపించిన దర్శకుల్లో సుకుమార్‌ మొదటివారు అనొచ్చు. యాక్షన్‌, మాస్ ఛట్రంలో తెలియకుండానే ఉండిపోయిన మహేష్‌ను ‘వన్‌ నేనొక్కడినే’తో బయటకు తీసుకొచ్చారు అని చెప్పొచ్చు. ఆ సినిమా సరైన ఫలితం ఇవ్వకపోయినా ఆ తర్వాత మహేష్‌ చాలా ఓపెన్‌గా సినిమాలు చేస్తున్నాడు. అందుకే వరుస విజయాలు అందుకుంటున్నాడు. ‘వన్‌’ తర్వాత వీరిద్దరి కాంబినేషన్‌లో ఓ సినిమా అనుకున్నా.. అది పట్టాలెక్కలేదు. అయితే మళ్లీ ఇప్పుడు ఆ టాక్‌ నడుస్తోంది.

మహేష్‌ బాబు – సుకుమార్‌ సినిమా అంటే ఆ హైప్‌ ఓ రేంజిలో ఉంటుంది. ఎందుకంటే ఇద్దరూ కలిస్తే ఆ మ్యాజిక్కే వేరు. అయితే ‘వన్‌’ తర్వాత కొన్ని సంఘటనల వల్ల ఇద్దరి మధ్య దూరం పెరిగింది అని అంటుంటారు. అయితే ‘సర్కారు వారి పాట’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌కి వచ్చి ‘మా మధ్య అంతా బాగానే ఉంది’ అని చెప్పకనే చెప్పారు. ఇప్పుడు ఇద్దరూ కలసి ఓ పాయింట్‌ అనుకున్నారు అని టాక్‌. ఆ సినిమా ఇప్పటికిప్పుడు ప్రారంభమయ్యే అవకాశం లేకపోయినా.. కలిసి చేస్తున్నారనే టాక్‌ అయితే తెచ్చింది.

ఎందుకంటే కనీసం మరో నాలుగేళ్ల వరకు మహేష్‌బాబు కాల్‌షీట్లు లేవని చెప్పేయొచ్చు. త్రివిక్రమ్‌ సినిమా తర్వాత మహేష్‌బాబు.. రాజమౌళి సినిమా చేయబోతున్నాడు. అడవి నేపథ్యంలో అడ్వంచరెస్‌ జోనర్‌లో ఈ సినిమా ఉంటుందని చెబుతున్నారు. కాబట్టి చిత్రీకరణ, పోస్ట్‌ ప్రొడక్షన్‌, ప్రమోషన్స్‌, రిలీజ్‌ ఇలా మొత్తంగా కనీసం రెండు, మూడేళ్లు పడుతుంది. ఆ తర్వాతే సుకుమార్‌ సినిమా ఉండొచ్చు. ఈ లోపు సుకుమార్‌ ‘పుష్ప 2’ సినిమా పూర్తి చేసి, రామ్‌చరణ్‌ సినిమా పనిలో పడతారట.

రామ్‌చరణ్‌ – సుకుమార్‌ కాంబినేసన్‌లో ఓ సినిమా ఉంటుందని ఆ మధ్య త్రివిక్రమ్‌ అన్యాపదేశంగా చెప్పిన విషయం తెలిసిందే. ఆ సినిమాలో ఓ సీన్‌ గురించి కూడా తెలిసింది అని త్రివిక్రమ్‌ చెప్పారు. కాబట్టి మహేష్‌తో సుక్కు సినిమా ఉండొచ్చు. అయితే ఎప్పుడు అనేదే ఇక్కడ విషయం. చూద్దాం.. ఈసారైనా ఈ జోడీ కలుస్తుందేమో.

విరాటపర్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’, ‘అంటే..’ తో పాటు ఎక్కువ నిడివితో వచ్చిన లేటెస్ట్ సినిమాల లిస్ట్..!
‘2.0’ టు ‘విక్రమ్’ తమిళ్ లో భారీ కలెక్షన్లు రాబట్టిన 10 సినిమాల లిస్ట్..!
ఎన్టీఆర్, నాగ చైతన్య.. టు కీర్తి సురేష్, ‘గుండమ్మ కథ’ రీమేక్ కు సూట్ అయ్యే 10 మంది స్టార్లు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus