Sukumar, Rajamouli: పుష్ప2 కు రూ.1000 కోట్లు వస్తాయని భావిస్తున్న సుకుమార్.. కానీ?

గత కొన్నేళ్లలో టాలీవుడ్ ఇండస్ట్రీలో దర్శకుల పారితోషికాలు ఊహించని స్థాయిలో పెరిగిపోయాయి. ముఖ్యంగా స్టార్ డైరెక్టర్ల రెమ్యునరేషన్లు హీరోల స్థాయికి పెరిగాయి. అందరు డైరెక్టర్లు కాకపోయినా కొంతమంది డైరెక్టర్లు ఈ స్థాయిలో పారితోషికాలను అందుకుంటున్నారు. అయితే రాజమౌళిని సుకుమార్ ఫాలో అవుతున్నారని కామెంట్లు వినిపిస్తున్నాయి. సుకుమార్ డైరెక్షన్ లో ప్రస్తుతం పుష్ప2 సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ తో పాటు సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాయి.

ఈ సినిమాకు సుకుమార్ రెమ్యునరేషన్ తీసుకోవడం లేదని తెలుస్తోంది. రాజమౌళి ఇప్పటికే రెమ్యునరేషన్ తో పాటు సినిమాకు వచ్చే లాభాలలో వాటా తీసుకుంటున్నారనే సంగతి తెలిసిందే. సుకుమార్ సైతం తన తర్వాత సినిమాల విషయంలో ఇదే ఫార్ములాను ఫాలో అవుతున్నారని తెలుస్తోంది. పుష్ప2 సినిమా 350 కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కనుండగా ఈ సినిమాకు 700 కోట్ల రూపాయల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగే అవకాశం ఉందని

సినిమాకు హిట్ టాక్ వస్తే పుష్ప ది రూల్ కచ్చితంగా 1000 కోట్ల రూపాయల కలెక్షన్లను సొంతం చేసుకుంటుందని సుకుమార్ భావిస్తున్నారు. ఈ సినిమా వాస్తవంగా ఆ రేంజ్ లో కలెక్షన్లను సొంతం చేసుకుంటే సుకుమార్ కు వచ్చే లాభాలు సైతం ఊహించని స్థాయిలో పెరిగే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు. పుష్ప ది రూల్ సినిమాతో 100 కోట్ల రూపాయల కంటే ఎక్కువ మొత్తం లాభాలు తన ఖాతాలో చేరే ఛాన్స్ ఉందని సుకుమార్ భావిస్తున్నారని తెలుస్తోంది.

సుకుమార్ పుష్ప ది రూల్ తో మరో ఇండస్ట్రీ హిట్ ను ఖాతాలో వేసుకోవడం ఖాయమని నమ్ముతున్నారు. సుకుమార్ తన సినీ కెరీర్ లో తక్కువ సినిమాలే తెరకెక్కించినా ఆ సినిమాలలో మెజారిటీ సినిమాలతో సక్సెస్ లను అందుకున్నారు. సుకుమార్ కెరీర్ విషయంలో ఆచితూచి అడుగులు వేస్తున్నారు.

బిగ్ బాస్ 6 తెలుగు 21 మంది కంటెస్టెంట్స్ గురించి మీకు తెలియని ఆసక్తికరమైన విషయాలు!

Most Recommended Video

భూమా మౌనిక కు ఆల్రెడీ పెళ్లయిందా?
బిగ్ బాస్ కంటెస్టెంట్ రేవంత్ గురించి 10 ఆసక్తికరమైన విషయాలు..!
ఛార్మి మాత్రమే కాదు నిర్మాతలయ్యి భారీగా నష్టపోయిన హీరోయిన్ల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus