స్టైలిష్ డైరెక్టర్… స్టార్ డైరెక్టర్… ట్యాలెంటెడ్ డైరెక్టర్ అనగానే మన సుకుమారే గుర్తుకొస్తాడు. అభిమానులు … టాలీవుడ్ లెక్కల మాష్టర్ అని ముద్దుగా పిలుచుకునే మన సుకుమార్ సినిమాల్లో ఎంతో ఇంటెలిజెన్స్ ఉంటుంది. హాలీవుడ్ రేంజ్ యాక్షన్ ఎలిమెంట్స్ ఉంటాయి. ‘ఆర్య’ ‘100% లవ్’ వంటి లవ్ స్టోరీ తీసినా, ‘1 నేనొక్కడినే’ వంటి యాక్షన్ మూవీ తీసినా, ‘రంగస్థలం’ వంటి రా అండ్ రస్టిక్ మూవీ తీసినా.. ఎమోషనల్ సీన్స్ మాత్రం మిస్ అవ్వకుండా చూసుకుంటాడు మన సుకుమార్.
వాటిని బట్టి రియల్ లైఫ్ లో మన సుకుమార్ చాలా ఇంటెలిజెంట్ కాదు కాదు పెద్ద జీనియస్ అనే చెప్పాలి. ఇదిలా ఉంటే.. సుకుమార్ ఎంతో ఎమోషనల్ గా ఇటీవల ఓ లేఖ రాసాడు.తన ప్రాణ స్నేహితుడు ప్రసాద్ మార్చి నేలలో మరణించాడు. ఈరోజు ఆతని పుట్టిన రోజు. దీంతో ఎంతో ఎమోషనల్ అయిన సుకుమార్ … ప్రసాద్ ను తలుచుకుని ఓ లేఖ రాసాడు. లేకపోవడం ఏంటి?’ అని ప్రసాద్ బ్రతికే ఉన్నట్టు కలగన్న సుకుమార్ తనతో మాట్లాడినట్టు ఓ కథగా రాసి…
చివరకి ఇదంతా కల… అని మేలుకొని గుర్తు చేసుకుని బాధ పడ్డాడు.‘బావగాడికి’ పుట్టినరోజు శుభాకాంక్షలు… అంటూ కన్నీళ్ళు విడుస్తూ పూర్తి చేసాడు. సోషల్ మీడియాలో ఇప్పుడు ఆ లేఖ వైరల్ అవుతుంది. ఎంతో క్రియేటివిటీతో ఆ లేఖ ఉంది. సుకుమార్ భార్య తబిత కూడా ‘ప్రసాద్ అన్నయ్య పుట్టినరోజు’ అంటూ శుభాకాంక్షలు చెప్పి ఎమోషనల్ అయ్యింది.
View this post on Instagram
Happy Birthday my dear friend Prasad.
A post shared by Sukumar B (@aryasukku) on
Most Recommended Video
అతి తక్కువ వయసులో లోకం విడిచిన తారలు
అత్యధిక ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన తెలుగు సినిమాలు…!
‘మహానటి’ లోని మనం చూడని సావిత్రి, కీర్తి సురేష్ ల ఫోటోలు…!