Sukumar: ఆ రీమేక్ లపై సుకుమార్ కు ఆసక్తి.. కానీ?

టాలీవుడ్ ఇండస్ట్రీలోని టాలెంటెడ్ డైరెక్టర్లలో సుకుమార్ ఒకరు. ఇతర డైరెక్టర్ల సినిమాలతో పోల్చి చూస్తే దర్శకుడు సుకుమార్ సినిమాలు భిన్నంగా ఉంటాయి. క్లాస్ సినిమాల కంటే మాస్ సినిమాలే దర్శకుడు సుకుమార్ కు మంచి పేరు తెచ్చిపెడుతుండటం గమనార్హం. ఒక్కో సినిమాకు ఈ డైరెక్టర్ రెండు నుంచి మూడేళ్ల సమయం తీసుకుంటున్నా మంచి క్వాలిటీతో సినిమాలను తెరకెక్కిస్తూ సత్తా చాటుతున్నారు. తాజాగా ఒక సందర్భంలో సుకుమార్ గతంలో తనకు ఎదురైన అనుభవాల గురించి చెప్పుకొచ్చారు.

కోలీవుడ్ సూపర్ స్టార్ అయిన రజినీకాంత్ తో సుకుమార్ తనకు ఎదురైన అనుభవాన్ని తాజాగా పంచుకున్నారు. రోబో సినిమా షూటింగ్ జరుగుతున్న సమయంలో తాను ఆ సినిమా సెట్స్ కు వెళ్లానని రజనీకాంత్ గారు తన దగ్గరకు రావడంతో తన చేతులు వణికిపోయాయని సుకుమార్ చెప్పుకొచ్చారు. అప్పటికే నా డైరెక్షన్ లో తెరకెక్కిన ఆర్య సినిమాను రజనీకాంత్ చూశారని సుకుమార్ అన్నారు. రజనీ సార్ నాతో ఆర్యలో ఒక సీన్ నచ్చిందని చెప్పారని సుకుమార్ చెప్పుకొచ్చారు.

తన కోసం రజనీ సార్ కుర్చీ తీసుకొని వచ్చి వేశారని ఆ మూమెంట్ నా జీవితంలో గోల్డెన్ మూమెంట్ అని సుకుమార్ కామెంట్లు చేశారు. కోలీవుడ్ ఇండస్ట్రీలో హిట్టైన రెండు సినిమాలను తాను రీమేక్ చేయాలని అనుకున్నానని సుకుమార్ వెల్లడించారు. నాలుగేళ్ల క్రితం విడుదలైన విక్రమ్ వేద మూవీ నాకు చాలా నచ్చిందని సుకుమార్ చెప్పుకొచ్చారు. ఎవరైనా తనను ఆ సినిమా రీమేక్ చేయాలని కోరితే చేద్దామని అనుకున్నానని ఆ సమయంలో తాను ఫ్రీగా ఉన్నానని సుకుమార్ చెప్పారు. రాచసన్ సినిమాను కూడా తాను రీమేక్ చేయాలని భావించానని సుకుమార్ చెప్పుకొచ్చారు.

అయితే రాచసన్ సినిమా ఇప్పటికే తెలుగులో రీమేక్ అయిన సంగతి తెలిసిందే. విక్రమ్ వేద సినిమా రీమేక్ పై సుకుమార్ ఆసక్తి చూపుతున్న నేపథ్యంలో ఈ సినిమాలో నటించడానికి స్టార్ హీరోలు ఎవరైనా ఆసక్తి చూపుతారేమో చూడాల్సి ఉంది. ఒక్కో మూవీకి సుకుమార్ 25 కోట్ల రూపాయల రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు.

2021.. ఇండస్ట్రీని వివాదాలతో ముంచేసింది!

Most Recommended Video

ఈ ఏడాది హీరోయిన్లుగా ఎంట్రీ ఇచ్చిన భామల లిస్ట్..!
ఈ ఏడాది ప్లాపుల నుండీ బయటపడ్డ హీరోలు ఎవరో తెలుసా?
ఈ ఏడాది వివాహం చేసుకున్న సినీ సెలబ్రిటీలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus