సినిమా అనేది ఓ ఎమోషన్.. చూసేవాళ్లకు ఎంతగా ఇన్‌స్పైర్ చేస్తుందో, చేసేవాళ్లకు అంతకుమించి అనేలా ఉంటుంది. ఈ మాటలు అక్షర సత్యం అనేలా తాజాగా మరోసారి నిరూపితమైంది. సినిమా చేయాలనే సంకల్పం ఓ వ్యక్తి తన అనారోగ్యం నుండి బయటపడ్డారు. ఆయనే ‘విరూపాక్ష’ సినిమా దర్శకుడు కార్తిక్ దండు. ‘విరూపాక్ష’ సినిమా ప్రచారంలో భాగంగా ఇటీవల జరిగిన ఓ ఈవెంట్‌లో తన శిష్యుడి గురించి సుకుమార్ ఈ విషయం చెప్పుకొచ్చారు.
టాలీవుడ్‌లో ఇప్పుడు సుకుమార్ (Sukumar) శిష్యుల హవా నడుస్తోందని చెప్పొచ్చు. గతేడాది చివర్లో ‘18 పేజెస్’ సినిమాతో పల్నాటి సూర్య ప్రతాప్ హిట్టు కొడితే.. ఈ ఏడాది ‘దసరా’ సినిమాతో అదిరిపోయే ఎంట్రీ ఇచ్చారు శ్రీకాంత్ ఓదెల. ఇప్పుడు ‘విరూపాక్ష’తో ఎంట్రీ ఇవ్వడానికి కార్తిక్ దండు రెడీగా ఉన్నారు. ఈ ముగ్గురూ సుకుమార్ శిష్యులే. ఈ క్రమంలో సుకుమార్ మాట్లాడుతూ కార్తిక్ చావు దగ్గరికి వెళ్లి వెనక్కి వచ్చినట్లు చెప్పారు.
కార్తీక్ ఆయనను కలవడానికి వచ్చినప్పుడు తన జీవితం చాలా చిన్నదని అన్నారట. మరో ఐదారేళ్లకు మించి తాను బతికే ఛాన్స్ లేదని వైద్యులు చెప్పారని కూడా తెలిపాడట. కార్తీక్‌కు ఒక ఆరోగ్య సమస్య ఉండేదని.. దాని వల్ల అతడి ప్లేట్‌లెట్స్ పడిపోయేవని సుకుమార్ తెలిపారు. అలాంటి స్థితి నుంచి అతను పోరాడి ‘విరూపాక్ష’ లాంటి సినిమాను డైరెక్ట్ చేయడం చిన్న విషయం కాదని సుకుమార్ మెచ్చుకున్నారు.
తీవ్ర అనారోగ్య సమస్య ఉన్నప్పటికీ చనిపోయేలోపు ఒక సినిమా డైరెక్ట్ చేసి వెళ్లిపోవాలని కార్తిక్ అనుకున్నారని… అయితే అనారోగ్యంతో చేసిన పోరాటంలో కార్తిక్ గెలుపొందాడని తెలిపారు. దీని వెనుక అతని కష్టం, సంకల్పంతోపాటు తన తల్లి ప్రార్థనలు కూడా ఉన్నాయని సుకుమార్ చెప్పారు. ‘విరూపాక్ష’ సినిమాను బాగా తీశారని మెచ్చుకున్న సుకుమార్… కథ చెప్పినప్పుడే బాగా తీస్తారనే నమ్మకం కలిగింది అని చెప్పారు. ఈ సినిమా కోసం తాను పెద్దగతా చేసింది ఏమీ లేదని.. కార్తీక్‌ను కేవలం పుష్ చేశానని చెప్పారు సుకుమార్.
శాకుంతలం సినిమా రివ్యూ & రేటింగ్!
అసలు పేరు కాదు పెట్టిన పేరుతో ఫేమస్ అయినా 14 మంది స్టార్లు.!
బ్యాక్ టు బ్యాక్ ఎక్కువ ప్లాపులు ఉన్న తెలుగు హీరోలు ఎవరంటే?
పూజా హెగ్డే కంటే ముందు సల్మాన్ ఖాన్ తో డేటింగ్ చేసిన 13 మంది హీరోయిన్లు!