Suma: ఒక్క షో కోసం వేల సంఖ్యలో చీరలు కట్టిన యాంకర్!

తెలుగు సినీ ఇండస్ట్రీలో యాంకర్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి సుమా కనకాల ప్రస్తుతం కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్న సంగతి మనకు తెలిసిందే. ఈమె గత రెండు దశాబ్దాల కాలం నుంచి యాంకర్ గా ఇండస్ట్రీలో కొనసాగుతూ ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు. ఇక సుమ కేవలం సినిమా ఈవెంట్లు మాత్రమే కాకుండా బుల్లితెర కార్యక్రమాలకు కూడా యాంకర్ గా వ్యవహరిస్తున్నారు. గతంలో ఈమె ఈ టీవీలో స్టార్ మహిళ అనే కార్యక్రమాన్ని కొన్నివేల ఎపిసోడ్స్ చేసిన సంగతి మనకు తెలిసిందే.

అయితే తాజాగా ఈ కార్యక్రమం గురించి సుమ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఈ షో కోసం తాను కేవలం సారీస్ మాత్రమే కట్టుకున్నానని తెలిపారు. అయితే ఈ ఒక్క షో కోసమే నేను 5000 చీరలు కట్టానని సుమ తెలియజేశారు. దీనితో పాటు స్వరాభిషేకం కార్యక్రమానికి మరొక 1500 చీరలు కట్టానని సుమా తెలిపారు. ఇలా ఈ రెండు కార్యక్రమాలకు 6500 సారీస్ కట్టుకున్నానని సుమ (Suma) ఈ సందర్భంగా చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

మరి ఈ చీరలన్నీ మీరే తీసుకెళ్ళారా అంటూ యాంకర్ ప్రశ్నించడంతో భగవంతుడు దయవల్ల నేను ఆ చీరలు మా ఇంటికి తీసుకు వెళ్లలేదని కేవలం అవి నా ఒంటి మీదకు మాత్రమే వచ్చాయి కానీ ఇంటి వరకు రాలేదు అంటూ సుమ ఈ సందర్భంగా చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. అనంతరం ఈమె తన కొడుకు సినిమా గురించి కూడా పలు విషయాలు తెలిపారు..

ఇక మీరు రోషన్ తో కలిసి ఏదైనా సినిమాలో నటించాలని కోరుకుంటున్నారా అంటూ సుమకు ప్రశ్న ఎదురు కావడంతో ఈమె త్వరలోనే అది కూడా నెరవేరబోతుంది అంటూ సుమ తన కొడుకు సినిమాలో కూడా నటించబోతున్నాను అంటూ పలు విషయాలను తెలియచేశారు. అయితే ఈమె తన కొడుకు మొదటి సినిమాలోనే నటిస్తున్నారా లేక తదుపరి సినిమాలలో నటిస్తున్నారా అన్న విషయాలు తెలియాల్సి ఉంది.

హాయ్ నాన్న సినిమా రివ్యూ & రేటింగ్!!

‘ఎక్స్ట్రా ఆర్డినరీ మెన్’ సినిమా రివ్యూ & రేటింగ్!
టాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ లో దాగున్న టాలెంట్స్ ఏంటో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus