ఇంటర్నెట్ అందుబాటులో లేని రోజుల్లో మన తెలుగు దర్శకులు హాలీవుడ్ సినిమాలను ఎలాంటి అడ్డూ ఆపూ లేకుండా కాపీ కొట్టేసి సినిమాలు తీసినా చూశారు జనాలు. కానీ.. ఎప్పడి నుంచైతే ఇంటర్నెట్ పుణ్యమా అని హాలీవుడ్ సినిమాలకు మాత్రమే కాక ప్రపంచాసినిమాకి కూడా ప్రేక్షకులకు దగ్గరయ్యారో అప్పట్నుంచి మన తెలుగు సినిమాలను వేరే సినిమాలతో కంపేర్ చేయడం మొదలెట్టారు. అందుకే ఈమధ్యకాలంలో దర్శకనిర్మాతలు హాలీవుడ్ సినిమాలను కాపీ కొట్టాలంటే భయపడుతున్నారు. అయితే.. సుమంత్ తాజా చిత్రమైన “ఇదం జగత్” టీజర్ ను చూస్తుంటే మాత్రం చాలా సింపుల్ గా ఒక హాలీవుడ్ ఫిలిమ్ ను కాపీ కొట్టేశాడని ఇట్టే పసిగట్టేశారు నెటిజన్లు.
“ఇదం జగత్” 2014లో విడుదలైన హాలీవుడ్ చిత్రం “నైట్ క్రాలర్” చిత్రానికి కాపీలా ఉంది. రాత్రి వేళలో జరిగే అక్రమాలను షూట్ చేస్తూ వాటిని లోకల్ ఛానల్ కు అమ్ముకొని సొమ్ము చేసుకునే హీరో కథ , కాగా తాజాగా విడుదలైన టీజర్ లో కూడా అదే తాలూకు షేడ్ కనిపిస్తుండటంతో నైట్ క్రాలర్ చిత్రాన్ని ఫ్రీ మేక్ చేస్తున్నారా ? లేక కొన్ని అంశాలను మాత్రమే తీసుకొని చేస్తున్నారా చూడాలి . అయితే టీజర్ తో మాత్రం ఫ్రీ మేక్ చిత్రమని ముద్ర పడుతోంది.