ఆసక్తి కలిగిస్తోన్న సుమంత్ లుక్

Ad not loaded.

సత్యం, గోదావరి, గోల్కొండ హై స్కూల్ వంటి విజయాలను అందుకున్న సుమంత్ మరో విభిన్నమైన కథతో మనముందుకు వస్తున్నారు. వీర్యం దానం చేసే యువకుని పాత్రలో సుమంత్ నటించిన “నరుడా డో నరుడా” చిత్రం ఫస్ట్ లుక్ ని సోమవారం అక్కినేని నాగార్జున సోషల్ మీడియా వేదికపై రిలీజ్ చేశారు.

టైటిల్ కి తగినట్లుగానే ఫస్ట్ లుక్ కూడా విభిన్నంగా డిజైన్ చేసి యువ దర్శకుడు మల్లిక్ రామ్ తన క్రియేటివిటీని ప్రదర్శించారు. “ఐ యామ్ స్పెర్మ్ డోనర్.. 100 పర్శంట్ స్ట్రైక్ రేట్ ” అంటూ టైటిల్ కి జోడించిన పంచ్ లైన్లు నేటి యువతను ఆకర్షించేలా ఉన్నాయి. సుమంత్ ఇందులో ఇదివరకు చిత్రాలకంటే యంగ్ గా కనిపిస్తున్నారు. ఈ పోస్టర్లు సినిమాపై అంచనాలను పెంచాయి. ఈ చిత్రంలో సుమంత్ సరసన మరాఠి నటి పల్లవి సుభాష్ నటిస్తోంది. తనికెళ్ల భరణి ఓ కీలక పాత్ర పోషిస్తోన్నారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus