మంచి స్క్రిప్ట్ తో వస్తే నేను రెడీ అంటున్న సుమంత్

ఈ వారం మూడు చిత్రాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. అవే బెల్లంకొండ సాయి శ్రీనివాస్ నటించిన ‘కవచం’, సందీప్ కిషన్ ‘నెక్స్ట్ ఏంటి?’, సుమంత్ నటించిన ‘సుబ్రహ్మణ్యపురం’. ఈ మూడు చిత్రాలలో ప్రేక్షకుల నుండి మంచి మార్కులు వేయించుకున్న చిత్రం ఒక్క ‘సుబ్రహ్మణ్యపురం’ మాత్రమే. సుమంత్ ,ఈషా రెబ్బా జంటగా నటించిన ఈ చిత్రానికి సంతోష్ జాగర్లమూడి దర్శకత్వంలో తెరకెక్కింది.

సుధాకర్ రెడ్డి నిర్మించిన థ్రిల్లర్ జానర్ సినిమాగా ప్రేక్షకులని అలరిస్తుంది. శేఖర్ చంద్ర అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ప్రధాన ఆకర్షణగా నిలిచింది. సీన్ బై సీన్ ఉత్కంఠతపెంచుతూ దర్శకుడు ఈ సినిమాని మంచి సినిమాగా మలిచాడు. ఇటీవల చిత్ర యూనిట్ నిర్మహించిన సక్సెస్ మీట్లో హీరో సుమంత్ మాట్లాడుతూ…. ‘నిన్న ఎలక్షన్స్ ఉన్నా సినిమా మంచి కలెక్షన్స్ వచ్చాయి. చాలా సంతోషంగా ఉంది. సంతోష్ లాగా ఎవరైనా మంచి స్క్రిప్ట్ తో వస్తే ఏ జోనర్ లో అయినా సినిమా చేయడానికి రెడీగా ఉన్నాను’ అంటూ చెప్పుకొచ్చారు సుమంత్.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus