తొలిసారి తమిళనాడు బోర్డర్‌ దాటుతున్న సన్‌ పిక్చర్స్‌.. రెండోది కూడా..!

అల్లు అర్జున్‌  (Allu Arjun)  సినిమా చేస్తాను అంటే.. అందులోనూ ‘పుష్ప’ (Pushpa) సినిమాల తర్వాత చేస్తాను అంటే ఏ నిర్మాత ముందుకురారు చెప్పండి. వాళ్ల ఇంట్లోనే ఓ పెద్ద బ్యానర్‌ కూడా ఉంది. స్నేహితుల బ్యానర్లు కూడా చాలానే ఉన్నాయి. ఇలాంటి సమయంలో వేరే ఇండస్ట్రీ నుండి ఓ నిర్మాత వచ్చి సినిమా చేస్తున్నారు అంటే.. కచ్చితంగా ఆ నిర్మాణ సంస్థ ఆలోచనలు వేరేగా ఉన్నాయని అర్థం. అలాంటి ఆలోచనలు ఇప్పుడున్న నిర్మాణ సంస్థ సన్‌ పిక్చర్స్‌ (Sun Pictures) అని చెప్పొచ్చు.

Sun Pictures

ఇప్పటికే ఓ తెలుగు సినిమా అనౌన్స్‌ చేసిన సన్‌ టీమ్‌ (Sun Pictures) .. మరో సినిమా ప్లాన్‌లో ఉంది అని చెబుతున్నారు. అల్లు అర్జున్‌ – అట్లీ (Atlee Kumar)  కాంబినేషన్‌లో ఓ సినిమా ఇటీవల అనౌన్స్‌ అయిన విషయం తెలిసిందే. ఈ సినిమాను ప్రముఖ నిర్మాణ సంస్థ సన్‌ పిక్చర్స్‌ నిర్మిస్తోంది. గత కొన్నేళ్లుగా తమిళనాడులో మాత్రమే సినిమాలు నిర్మిస్తూ వచ్చిన ఈ సంస్థ.. తొలిసారి బౌండరీలు దాటి తెలుగు సినిమా వరకు వచ్చింది.

అయితే ఇదేదో అట్లీ కోసం మాత్రమే సినిమా చేయడం కాదు.. తెలుగులోకి పూర్తి స్థాయిలో రావాలి అనుకునే ఆ సినిమాను ఓకే చేశారట. రెండో సినిమాను కూడా స్టార్ హీరోతోనే చేయాలని ఫిక్స్‌ అయ్యారట. అయితే మరి ఆ సినిమా తమిళ దర్శకుడు హ్యాండిల్‌ చేస్తారా? లేక తెలుగు దర్శకుడా అనేది చూడాలి. ఇక అల్లు అర్జున్‌ – అట్లీ సినిమా విషయానికొస్తే.. ‘రాజా రాణి’ (Raja Rani) లాంటి ప్రేమకథతో దర్శకుడిగా పరిచయమైన అట్లీ..

ఆ తర్వాత విజయ్‌తో (Vijay Thalapathy) ‘తెరి’ (Theri), ‘మెర్సల్’ (Mersal), ‘బిగిల్’ (Bigil) లాంటి సినిమాలు చేశారు. ఆ తర్వాత మరోసారి కలసి సినిమా చేస్తారని వార్తలొచ్చాయి. ఈ క్రమంలోనే ఓ సూపర్‌ హీరో తరహా సినిమా ఒకటి చేస్తారు అని వార్తలొచ్చాయి. దాని కోసం చర్చలు కూడా సాగాయి. కానీ ప్రాజెక్ట్‌ ముందుకెళ్లలేదు. ఇప్పుడు ఆ కథనే అల్లు అర్జున్‌తో తన స్థాయిలో సిద్ధం చేసి ఇచ్చారు అని అంటున్నారు.

తెలుగు హీరోలు.. తమిళ కెప్టెన్లు.. గత చేదు అనుభవాలు చెరిపేస్తారా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus