తెలుగు హీరోలు.. తమిళ కెప్టెన్లు.. గత చేదు అనుభవాలు చెరిపేస్తారా?

తెలుగు హీరోలు – తమిళ దర్శకులు (Tamil Directors).. ఈ కాంబినేషన్‌ గురించి ఇప్పుడు సోషల్‌ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. దీనికి కారణం తన తర్వాతి సినిమా నెల్సన్‌ దిలీప్‌ కుమార్‌తో (Nelson Dilip Kumar) ఉంటుంది అని ఎన్టీఆర్‌ చూఛాయగా చెప్పడమే. ఆ సినిమా ఎప్పుడు ఉంటుంది, ఎప్పుడు అధికారికంగా చెబుతారు అనే విషయంలో క్లారిటీ లేదు కానీ.. సినిమా అయితే ఉంటుంది అంటున్నారు. దీంతో తెలుగు హీరోలతో తమిళ హీరోలు సినిమా చేస్తే ఎలా ఉంటుంది..

Tamil Directors

బ్లాక్‌బస్టర్‌లు సాధ్యమేనా అనే ప్రశ్న మొదలైంది. దీనికి కారణం గతంలో తమిళ తంబీలు మన హీరోలతో చేసిన సినిమాలు, ఆ చిత్రాల ఫలితాలే. సితార ఎంటర్‌టైన్మెంట్స్‌ పతాకంపై ఎన్టీఆర్‌ (Jr NTR) – నెల్సన్‌ దిలీప్‌ కాంబినేషన్‌లో ఓ సినిమా అని చాలా రోజులగా వార్తలొస్తున్నాయి. ఆ మధ్య నిర్మాత నాగవంశీని (Suryadevara Naga Vamsi)  అని అడిగితే నెల్సన్‌ దిలీప్‌తో తమ బ్యానర్‌లో సినిమా కన్‌ఫామ్‌ కానీ.. హీరో ఎవరో తర్వాత చెబుతాం అన్నారు.

అయితే ఇప్పుడు అదే పక్కా అంటున్నారు. ఇక అల్లు అర్జున్‌ (Allu Arjun)  – అట్లీ (Atlee Kumar) కాంబినేషన్‌ సినిమా ఇటీవల అనౌన్స్‌ అయింది. అత్యంత భారీ బడ్జెట్‌ సినిమా అని టాక్‌. ఆ మేకింగ్‌ సీన్స్‌ చూసినా అదే తెలుస్తోంది అనుకోండి. ఇక ప్రభాస్‌ (Prabhas) – లోకేశ్‌ కనగరాజ్‌ (Lokesh Kanagaraj) కాంబినేషన్‌లో ఓ సినిమా ఉంటుంది అంటున్నారు. అలాగే రామ్ చరణ్‌  (Ram Charan)– లోకేశ్‌ కాంబినేషన్‌ గురించి కూడా డిస్కషన్‌ నడిచింది. ధనుష్‌ కూడా చరణ్‌కు ఓ కథ చెప్పారని టాక్‌ వచ్చింది.

దీంతో తెలుగు – తమిళ కాంబో ఓకేనా అని చూస్తే.. గతంలో జరిగిన కష్టాలు కళ్ల ముందుకు వస్తున్నాయి. గతం వరకు ఎందుకు రీసెంట్‌గా వచ్చిన డిజాస్టర్‌ ‘గేమ్‌ ఛేంజర్‌’ (Game Changer) దర్శకుడు శంకర్‌ (Shankar) తమిళ సినిమానే కదా. మహేష్‌ (Mahesh Babu) కెరీర్‌లో అతి పెద్ద డిజాస్టర్‌ ఇచ్చిన మురుగదాస్‌(A.R. Murugadoss) కూడా కోలీవుడ్‌ నుండే. పవన్‌ కల్యాణ్‌ (Pawan Kalyan) – సాయితేజ్‌కి (Sai Dharam Tej) ‘బ్రో’ (BRO) లాంటి ఇబ్బందికర బొమ్మ ఇచ్చిన సముద్రఖని (Samuthirakani), రవితేజకు (Ravi Teja) ‘దరువు’ (Daruvu) వేసిన శివ (Shiva) ఇలా చాలా చేదు కథలే ఉన్నాయి. కాబట్టి తెలుగు హీరోలు కాస్త చూసుకొని చేయండమ్మా!

అల్లు అర్జున్ – అట్లీ.. ఆమెను లాక్ చేసేశారా..?!

 

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus