టాలీవుడ్ ప్రముఖ హీరోలలో ఒకరైన సందీప్ కిషన్ మరికొన్ని రోజుల్లో ఊరు పేరు భైరవకోన సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఈ నెల 14వ తేదీన వాలెంటైన్స్ డే సందర్భంగా ఈ సినిమా పెయిడ్ ప్రీమియర్స్ ప్రదర్శితం కానున్నాయని తెలుస్తోంది. ఊరు పేరు భైరవకోన ప్రమోషన్స్ లో భాగంగా మైఖేల్ సినిమా గురించి సందీప్ కిషన్ స్పందిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. చిన్నచిన్న తప్పుల వల్లే ఆ సినిమా ఫ్లాపైందని సందీప్ పేర్కొన్నారు.
మైఖేల్ మూవీని 90 శాతం పర్ఫెక్ట్ గా ల్యాండ్ చేశామని ఆ సినిమా టీజర్, ట్రైలర్ కు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చిందని సందీప్ కిషన్ చెప్పుకొచ్చారు. మైఖేల్ మూవీ షూట్ సమయంలో మేము కూడా ఎగ్జైట్ అయ్యామని ఆయన కామెంట్లు చేశారు. మైఖేల్ మూవీ ఔట్ పుట్ బాగానే వస్తుందని అనుకున్నామని సందీప్ వెల్లడించారు. రిలీజ్ కు ముందు ముగ్గురు ప్రొడ్యూసర్లు ఈ సినిమాను చూశారని ఆయన తెలిపారు.
ఆ నిర్మాతలలో ఇద్దరు నిర్మాతలు సినిమా బాగుందని చెప్పగా మరో నిర్మాత మాత్రం సినిమా అస్సలు బాలేదని ఏదో ఒకటి చేయాలని చెప్పడంతో నేను షాకయ్యానని సందీప్ పేర్కొన్నారు. ఆ సమయానికి నేను డబ్బింగ్ లో ఉన్నానని సినిమా చూడలేదని సందీప్ తెలిపారు. ఆ తర్వాత ప్రచారంలో బిజీ అయ్యానని ఆయన కామెంట్లు చేశారు. రిలీజ్ కు ముందురోజు రాత్రి మైఖేల్ చూశానని సందీప్ పేర్కొన్నారు.
మైఖేల్ మూవీలో మొదటి 30 నిమిషాలు అదిరిందని ఆ తర్వాత సన్నివేశాలు మాత్రం కనెక్ట్ కాలేదని సందీప్ కామెంట్లు చేశారు. తాను ఊహించిన విధంగానే ఆ సినిమా రిజల్ట్ వచ్చిందని ఆయన పేర్కొన్నారు. రిలీజ్ కు 14 రోజుల ముందు మైఖేల్ ఫస్ట్ కాపీ రెడీ అయ్యి ఉంటే ఆ సినిమా ఫలితం మరోలా ఉండేదని (Sundeep Kishan) సందీప్ కిషన్ చెప్పుకొచ్చారు. సందీప్ వెల్లడించిన విషయాలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
యాత్ర 2 సినిమా రివ్యూ & రేటింగ్!
మిస్ పర్ఫెక్ట్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
బూట్‌కట్ బాలరాజు సినిమా రివ్యూ & రేటింగ్!