మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం ఈ విషయం గురించి. ఎవరికి రాసినపెట్టి ఉన్న సినిమా వారికే దక్కుతుంది అని. దాని కంటే ముందు ఆ సినిమా ఎంతమంది దగ్గరికో వెళ్లినా ఫైనల్‌గా రాసిపెట్టి ఉన్నవాళ్లకే వెళ్తుంది. అలా రీసెంట్‌గా వెళ్లిన ఓ సినిమా గురించి ఇప్పుడు చెబుతున్నాం. చాలా రోజులుగా సరైన విజయం కోసం ఎదురుచూస్తున్న శ్రీవిష్ణుకు (Sree Vishnu) హిట్ రుచి చూపించిన ‘సామజవరగమన’ (Samajavaragamana) గురించే. ఈ సినిమా ఛాన్స్ తొలుత సందీప్ కిషన్‌కి వచ్చిందట.
30 సినిమాలు చేసినా ఇంకా ఆశించిన కెరీర్ అందుకోవడంలో సందీప్ కిషన్ (Sundeep Kishan) ఇబ్బందిపడుతున్నారు. దీనికి ఆయన కథల ఎంపికలో సమస్యలే కారణం. ఎంతో నమ్మి ఓకే చేసిన సినిమాలు ఆశించిన ఫలితాలు ఇవ్వడం లేదు. వివిధ కారణాల వల్ల వదిలేసిన సినిమా భారీ విజయం అందుకుంటున్నారు. అలా ఓ డిజాస్టర్ సినిమా కోసం ‘సామజవరగమన’ సినిమాను వదులుకున్నాడు సందీప్ కిషన్. తన కొత్త సినిమా ‘మాజాకా’ (Mazaka) ప్రచారంలో భాగంగా ఈ విషయాన్ని ఇటీవల చెప్పుకొచ్చాడు.
‘సామజవరగమన’ సినిమా నిర్మాతల్లో ఒకరైన అనిల్ సుంకర (Anil Sunkara) ఆ సినిమాను తొలుత సందీప్ కిషన్ దగ్గరకు తీసుకెళ్లారట. ఇద్దరూ బాగా క్లోజ్ కావడంతో సినిమా చేద్దామని సూచించారట. కానీ ఆ సమయంలో ‘మైఖేల్’ (Michael) అనే మరో సినిమాను సందీప్ చేస్తున్నాడు. రెగ్యులర్ కమర్షియల్ సినిమానే అయినా.. అదొక డిఫెంట్ మూవీ. ఆ సినిమా చేస్తుండగా ‘సామజవరగమన’ లాంటి కామెడీ టచ్ ఉన్న మూవీ చేస్తే ఇబ్బంది అవుతుంది అని సందీప్ ఈ సినిమాకు నో చెప్పాడట.
అయితే ఆ సినిమా వదులుకున్నందుకు బాధ ఏమీ లేదు అని సందీప్ అంటున్నాడు. నిజానికి సందీప్ ‘సామజవరగమన’ లాంటి సినిమా బాగానే ఉంటుంది. అయితే చేసి ఉంటే ఎలాంటి ఫలితం వచ్చి ఉండేది అనే మాట మనం చెప్పలేం. ఎందుకంటే శ్రీవిష్ణు ఆ సినిమాలో అదిరిపోయే పర్‌ఫార్మెన్స్ ఇచ్చాడు. కాబట్టి సందీప్‌కి ఆ సినిమా రాసిపెట్టి లేదు అంతే.