సందీప్ కిషన్ టాలీవుడ్లో ఉన్న అండర్రేటెడ్ హీరో. మంచి సబ్జెక్ట్..లు సెలెక్ట్ చేసుకుంటూ సినిమాలు చేస్తున్నాడు. సినిమా కోసం బాగా కష్టపడతాడు కూడా..! లోకేష్ కనగరాజ్, మేర్లపాక గాంధీ, మహేష్ బాబు పి(మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి).. వంటి టాలెంటెడ్ దర్శకులను పరిచయం చేసింది సందీప్ కిషనే అనడంలో అతిశయోక్తి లేదు. అయితే సందీప్ కి మాత్రం హిట్టు దొరకడం లేదు. మధ్యలో ‘నిను వీడని నీడను నేనే’ ‘ఎ1 ఎక్స్ ప్రెస్’ ‘గల్లీ రౌడీ’ వంటి యావరేజ్ సినిమాలు పడ్డాయి.
కానీ ఆ తర్వాత చేసిన ‘మైఖేల్’ పెద్ద డిజాస్టర్ అయ్యింది. ఈసారి ఎలాగైనా హిట్టు కొట్టాలని భావించి ‘ఊరు పేరు భైరవకోన’ సినిమా చేశాడు.వి ఐ ఆనంద్ దీనికి దర్శకుడు. ఇదిలా ఉండగా.. సందీప్ కిషన్ పై గతంలో ఎన్నో రూమర్స్ వచ్చేవి. రెజీనా వంటి హీరోయిన్లతో ఇతను ప్రేమాయణం నడుపుతున్నాడు అని..! వీటి పై తాజాగా ఇతను క్లారిటీ ఇచ్చాడు. సందీప్ కిషన్ (Sundeep Kishan) మాట్లాడుతూ… “నేను ముగ్గురు అమ్మాయిలను ప్రేమించాను.
ఒక అమ్మాయితో 4 ఏళ్ళు రిలేషన్ లో ఉన్నాను. మరో అమ్మాయి తో 2 ఏళ్ళు, ఇంకో అమ్మాయితో 2 ఏళ్ళు సీరియస్ రిలేషన్ కొనసాగింది. కానీ ఒక్కటి కూడా వర్క్ అవుట్ కాలేదు. ఇప్పుడు నేనున్న పొజిషన్లో ఆలోచిస్తే ప్రేమ అంత ముఖ్యం కాదు అనిపిస్తుంది. నేను ప్రేమించిన ముగ్గురూ కూడా సినీ పరిశ్రమకు చెందిన అమ్మాయిలే. ఏళ్ల తరబడి రిలేషన్ నడిచినా ఎవరికీ తెలియకుండా సీక్రెట్ గా ఉంచాను. నాకు రెజీనాకు మధ్య ఎఫైర్ ఉందని ప్రచారం జరిగింది. కానీ అందులో నిజం లేదు” అంటూ క్లారిటీ ఇచ్చాడు.