ప్రముఖ సినీ నటుడు, కమెడియన్ , హీరో అయిన సునీల్ అనారోగ్యంతో హాస్పిటల్ లో చేరారా? అవుననే అంటున్నాయి ఫిలింనగర్ వర్గాలు. ప్రస్తుతం ఈ వార్త వైరల్ అవుతుంది. సునీల్ ను అభిమానించే కొంతమంది అభిమానులు ఈ వార్త తెలిసినప్పటి నుండీ కలవరపడుతున్నారు. సోషల్ మీడియాలో కూడా సునీల్ కు మెసేజ్ లు చేస్తున్నారు. దీంతో వెంటనే సునీల్ ఈ విషయం పై స్పందించి క్లారిటీ ఇచ్చారు.
సునీల్ మాట్లాడుతూ.. ‘నేను ఆరోగ్యంగానే ఉన్నాను. చాలా మంది నాకు ఏమైందా అని కంగారుపడుతూ మెసేజ్ లు చేస్తున్నారు. నా పై ఉన్న అభిమానానికి థాంక్స్ అండి. నేను ఆరోగ్యంగానే ఉన్నాను. చిన్నపాటి సైనస్, ఇన్ఫెక్షన్ వల్ల ట్రీట్మెంట్ తీసుకుంటున్నాను. నా ఆరోగ్యం పై వస్తున్న వార్తలకి నా బంధువులు కూడా కంగారుపడి మెసేజ్ లు, ఫోన్ లు చేస్తున్నారు. ఎవ్వరూ కంగారుపడకండి.” అంటూ చెప్పుకొచ్చాడు.ప్రస్తుతం హైదరాబాద్ లోని ‘ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రో ఎంటరోలజీలో’ సునీల్ చికిత్స పొందుతున్నాడు.