Sunil, Trivikram: సునీల్- త్రివిక్రమ్ ల పెళ్లి ఒకే రోజు జరిగిందన్న విషయం మీకు తెలుసా?

సునీల్- త్రివిక్రమ్.. ఇద్దరూ కూడా బెస్ట్ ఫ్రెండ్స్ ..! ఈ విషయం చాలా మందికి తెలిసిందే. ఇద్దరూ కూడా ఆంధ్రప్రదేశ్, పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన భీమవరంకి చెందిన వారే..! కెరీర్ ప్రారంభంలో సునీల్- త్రివిక్రమ్.. ఇద్దరూ కూడా ఒకే రూమ్లో ఉండేవారు. అవకాశాల కోసం స్టూడియోల చుట్టూ తిరిగేవారు. సునీల్ కెరీర్ ప్రారంభంలో పవన్ కళ్యాణ్ డెబ్యూ మూవీ అక్కడ అమ్మాయి ‘అక్కడ అబ్బాయి’ చిత్రంలో నటించాడు. అటు తర్వాత ‘పాపే నా ప్రాణం’ వంటి సినిమాల్లో కూడా అంటించాడు.

అయితే సునీల్ కు మంచి బ్రేక్ ఇచ్చింది ‘చిరునవ్వుతో’ ‘నువ్వే కావాలి’.ఆ సినిమాలకి రైటర్ గా త్రివిక్రమ్ పనిచేసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత ‘నువ్వు నేను’ ‘మనసంతా నువ్వే’ చిత్రాలతో స్టార్ కమెడియన్ అయిపోయాడు. దాదాపు ఇద్దరి జర్నీ ఒకేసారి మొదలైంది. ఇద్దరూ బెస్ట్ ఫ్రెండ్స్ కాబట్టి.. సునీల్ కు త్రివిక్రమ్ తన సినిమాల్లో అవకాశాలు కల్పిస్తున్నాడు. ఇంకో విచిత్రం ఏంటంటే.. వీరిద్దరి పెళ్లి ఒకే సంవత్సరంలో ఒకే రోజు జరిగింది.

బహుశా ఈ విషయం ఎక్కువ మందికి తెలిసుండదు.2002 వ సంవత్సరం అక్టోబర్ 11నే వీరిద్దరి వివాహం జరిగింది. త్రివిక్రమ్ పెళ్లి.. శ్రీనగర్ కాలనీలో ఉన్న సత్య సాయి నిగమంలో సిరివెన్నెల సీతారామశాస్త్రి సోదరుడి కూతురు సాయి సౌజన్యతో జరిగింది. మరోపక్క సునీల్ వివాహం శిల్పారామం వద్ద ఉన్న సైబర్ గార్డెన్స్ లో శృతి తో ఘనంగా జరిగింది. సునీల్ కు ఇద్దరు పిల్లలు ఉన్నారు. త్రివిక్రమ్ కు కూడా ఇద్దరు పిల్లలు ఉన్నారు.

సునీల్ క్షత్రియ కుటుంబానికి చెందిన వ్యక్తి కాగా, త్రివిక్రమ్ బ్రాహ్మణ కుటుంబానికి చెందిన వ్యక్తి. అయితే త్రివిక్రమ్ కూడా ఎక్కువగా నాన్ వెజ్ ను ఇష్టపడుతూ ఉంటారట. అతనికి నాన్ వెజ్ తినాలి అనిపించిన ప్రతీసారి సునీల్ ఇంటికి వెళ్తారు అని వినికిడి. ప్రస్తుతం త్రివిక్రమ్.. మహేష్ బాబుతో ఓ సినిమా చేస్తున్నాడు. ఈ మూవీలో సునీల్ కూడా నటిస్తున్నట్టు ఇన్సైడ్ టాక్.

హిట్2 సినిమా రివ్యూ& రేటింగ్!
మట్టి కుస్తీ సినిమా రివ్యూ & రేటింగ్!

ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం సినిమా రివ్యూ & రేటింగ్!
డీజే టిల్లు టు మసూద ఈ ఏడాది ఎటువంటి అంచనాలు లేకుండా వచ్చి హిట్టు కొట్టిన సినిమాలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus