Sunil: అప్పుడు కామెడీ చేశాడు.. ఇప్పుడు దెబ్బలాడతాడా..!

పవన్ కళ్యాణ్ ఇప్పుడు వరుస సినిమాలను లైన్లో పెడుతున్నారు. ఆల్రెడీ ‘హరి హర వీర మల్లు’ సెట్స్ పై ఉంది. మరోపక్క హరీష్ శంకర్ దర్శకత్వంలో ‘తేరి’ రీమేక్ సిద్దమవుతుంది. పూజా కార్యక్రమాలతో ఆ ప్రాజెక్టు లాంఛనంగా ప్రారంభమైంది. దీంతో పాటు సుజీత్ డైరెక్షన్లో కూడా ఓ సినిమాని ప్రారంభించారు పవన్. ‘ఓజి’ అనే వర్కింగ్ టైటిల్ తో ఈ మూవీ రూపొందనుంది. డివివి దానయ్య ఈ చిత్రానికి నిర్మాత.

ఈ రెండితో పాటు ‘పీపుల్ మీడియా ఫ్యాక్టరీ’ వారికి కూడా పవన్ కళ్యాణ్ ఓ సినిమా చేయాలి. ఆ సినిమా డైరెక్టర్ సముద్ర ఖని, మరో హీరోగా సాయి ధరమ్ తేజ్, నటిస్తున్నారు. ఇది ‘వినోదయ సీతమ్’ కు రీమేక్. సుజీత్ తో చేస్తున్న సినిమా కూడా రీమేక్ అని ఇన్సైడ్ టాక్ వినిపిస్తుంది. కానీ ఇంకా దాని గురించి క్లారిటీ రాలేదు. ఇదిలా ఉండగా.. ‘ఓజి’ గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ ఇప్పుడు ఫిలిం నగర్లో షికారు చేస్తుంది. అదేంటి అంటే..

ఈ సినిమాలో విలన్ గా సునీల్ నటించబోతున్నారట. అతనొక సీక్రెట్ మాఫియా డాన్ గా కనిపిస్తాడు అని వినికిడి. సునీల్ విలన్ గా చేయడం ఇది మొదటిసారి కాదు. రవితేజ నటించిన ‘డిస్కో రాజా’, సుహాస్ హీరోగా నటించిన ‘కలర్ ఫోటో’, అల్లు అర్జున్ – సుకుమార్ కాంబినేషన్లో తెరకెక్కిన ‘పుష్ప’ (ది రైజ్) సినిమాల్లో అతను విలన్ గా నటించి మెప్పించాడు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ కు ఢీ కొట్టే పవర్ ఫుల్ విలన్ గా కనిపించబోతున్నాడన్న మాట.

గతంలో పవన్ కళ్యాణ్ నటించిన ‘గుడుంబా శంకర్’ ‘బాలు’ ‘జల్సా’ వంటి సినిమాల్లో సునీల్ కమెడియన్ గా కనిపించాడు. ఈసారి మాత్రం విలన్ గా పవన్ తో దెబ్బలాడడానికి రెడీ అవుతున్నాడని తెలుస్తుంది. సునీల్ కు ఇంత బంపర్ ఆఫర్ రావడం వెనుక అతని స్నేహితుడు.. త్రివిక్రమ్ ఉన్నట్లు వినికిడి.

రైటర్‌ పద్మభూషణ్‌ సినిమా రివ్యూ & రేటింగ్!
రెబల్స్ ఆఫ్ తుపాకుల గూడెం సినిమా రివ్యూ & రేటింగ్!

మైఖేల్ సినిమా రివ్యూ & రేటింగ్!
టాలీవుడ్ లో రీమిక్స్ చేసిన 20 తెలుగు పాటలు ఇవే!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus